మన ఊరు మన బడి, మన బస్తి మన బడి కార్యక్రమం కింద మొదటి విడతలో ఎంపిక చేసిన పాఠశాలకు త్వరగా ఎం.ఓ.యూ పూర్తి అయినవాటికి మరమ్మతు పనులు ప్రారంభించాలి – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

మన ఊరు మన బడి, మన బస్తి మన బడి కార్యక్రమం కింద మొదటి విడతలో ఎంపిక చేసిన పాఠశాలకు త్వరగా ఎం.ఓ.యూ పూర్తి అయినవాటికి మరమ్మతు పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మన ఊరు మనబడి కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు. మొదటి విడతలో ఎంపిక చేసిన 290 పాఠశాలలకు గాను ఇప్పటి వరకు ఇంకా టెక్నీకల్ అనుమతులు మంజూరు కానివి, ప్రాజెక్టు అప్లోడ్ కానివాటిపై వివరాలు అడిగారు. పరిపాలన అనుమతులు మంజూరు కై ఎస్టిమేషన్లు సాంకేతిక అనుమతులతో తన లాగిన్ కు పంపించాలని సూచించారు. ఇంకా పెండింగ్ ఉన్న వాటిపై వివరణ తీసుకున్నారు. ఎంపిక చేసిన అన్ని పాఠశాలల్లో మరమ్మతులు, మౌళిక సదుపాయాలు పూర్తి చేసి పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేనాటికి పూర్తి చేసే విధంగా కార్యాచరణ ఉండాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో డి.ఈ.ఓ గోవింద రాజులు, ఈ.ఈ. ఆర్.అండ్ బి. భాస్కర్, ఈ.ఈ ఈ.డబ్ల్యూ. ఐ.డి.సి. రాంచందర్, ఇఇ.పి.ఆర్. దామోదర్ రావ్, డి.ఈ లు, ఏ.ఈ. లు పాల్గొన్నారు.

Share This Post