మన ఊరు మన బడి మొదటి విడతలో ఎంపిక చెసిన పాఠశాలల మరమ్మత్తు పనులు, మౌళిక సదుపాయాలు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు.

మన ఊరు మన బడి మొదటి విడతలో ఎంపిక చెసిన పాఠశాలల మరమ్మత్తు పనులు, మౌళిక సదుపాయాలు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లొ ట్.ఎస్.ఈ. డబ్ల్యూ.ఐ.డి.సి  ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన ఊరు మన బడి పనులు ఆలస్యం కావడం పై ఆగ్రహం వ్యక్తం  చేశారు.  పనుల్లో వేగం పెంచాలని, ఇంకా చేసిన పనికి బిల్లులు సైతం సకాలం లో తయారు చేసి  కలెక్టర్ లాగిన్ కు పంపలేకపోతున్నారన్నారు.  ఇప్పటి వరకు కేవలం 6.47 కోట్లు మాత్రమే బిల్లులు పేమెంట్ చేయడం జరిగిందని, బిల్లులు సకాలంలో చెల్లించకపోతే పని ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల్లో వేగం పెంచాలని 15 రోజుల్లో అన్ని పూర్తి అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ఈ సమావేశంలో  డి.ఈ రాము, ఏ.ఈ లు తదితరులు పాల్గొన్నారు.                                          

Share This Post