మన ఊరు మన బడి లో ఎంపిక చేసిన మోడల్ స్కూల్స్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి….. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

మన ఊరు మన బడి లో ఎంపిక చేసిన మోడల్ స్కూల్స్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి….. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

మన ఊరు మన బడి లో ఎంపిక చేసిన మోడల్ స్కూల్స్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి….. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

మహబూబాబాద్, జూన్ -04:

మన ఊరు మన బడి లో ఎంపిక చేసిన మోడల్ స్కూల్స్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక సంబంధిత అధికారులను ఆదేశించారు.

శనివారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కె. శశాంక మన ఊరు మన బడి కార్యక్రమంపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పనులు ప్రణాళిక బద్దంగా చేపట్టాలని, ఎఫ్.టి. ఓ. జనరేట్ అయిన వాటి పనులను స్పీడ్ అప్ చేయాలని, మేజర్, మైనర్ మరమ్మతులను పూర్తి చేయాలని సూచించారు. ఎం.పి.పి.ఎస్. రాజోలు, కురవి పాఠశాలలను తనిఖీ చేస్తానని, అవసరం మేరకు ప్రతిపాదనలు తయారు చేసి సిద్ధంగా ఉంచాలని, అలాగే పల్లె, పట్టణ ప్రగతి సందర్భంగా ఆయా గ్రామాల్లోని పాఠశాలలను పరిశీలిస్తానని, నివేదికలతో సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కెసముద్రం, కురవి, గూడూరు, డోర్నకల్, నరసింహుల పేట, మరిపెడ, నెల్లికుదురు, దంతాలపల్లి మండలాలకు సంబంధించి UDISE ప్రకారం ఇచ్చిన రీ ఎస్టిమేట్స్ ను పరిశీలించారు. టాయిలెట్ లు, కిచెన్ షెడ్స్ ను పకడ్బందీగా తయారు చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎండి అబ్దుల్ హై, పిఆర్. ఈ.ఈ. సురేష్, ఆర్ అండ్ బి ఈఈ తానేశ్వర్, డి.ఈ.లు, ఈ.డి.ఎం. ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post