మన ఊరు – మన బడి లో చేపట్టిన మోడల్ పాఠశాలను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలి….. పండగ వాతావరణంలో ప్రారంభించుకోవాలి….. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

 

మన ఊరు – మన బడి లో చేపట్టిన మోడల్ పాఠశాలను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలి…..

పండగ వాతావరణంలో ప్రారంభించుకోవాలి…..
జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

జిల్లాలో మన ఊరు – మన బడి లో చేపట్టిన మోడల్ పాఠశాలలను ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ లోని ఆయన ఛాంబర్ లో అదనపు కలెక్టర్ రాజార్షి తో కలిసి విద్య,ఇంజనీరింగ్ శాఖల అధికారులతో ఫిబ్రవరి ఒకటిన మన ఊరు మన బడి కింద పూర్తయిన మోడల్ పాఠశాల ప్రారంభాలకు సంబంధించి చేయాల్సిన ఆయా ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.

మంత్రి, ఆయా ప్రజా ప్రతినిధులతో ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని పనులు సక్రమంగా జరగాలన్నారు. పండగ వాతావరణంలో ప్రారంభించుకునెలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.ప్రోటోకాల్ పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు,విద్యార్థుల తల్లిదండ్రులు,ప్రజలు,విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనేలా చూడాలన్నారు.

ఆయా ఏర్పాట్లను సంబంధిత అధికారులు, నియోజకవర్గం ప్రతెకాధికారులు,మండల ప్రత్యేక అధికారుల కోఆర్డినేషన్ తో పూర్తి చేయాలని, ఏలాంటి పొరపాట్లకు తావివ్వరాదన్నారు. అందరి భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయంతం చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాజార్షి షా, జెడ్పీ
సి ఈ ఓ ఎల్లయ్య,జిల్లా విద్యాధికారి నాంపల్లి రాజేష్,డి ఆర్ డి ఓ శ్రీనివాస్ రావు,డి సి ఓ ప్రసాద్,డి ఐ సి జిఎం ప్రశాంత్ కుమార్,ఇంజనీరింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share This Post