మన ఊరు మన బడి, వైద్య, ఆరోగ్య సేవలపై వీడియో సమావేశం ద్వారా సమీక్షించిన రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రా రెడ్డి.

మన ఊరు మన బడి, వైద్య, ఆరోగ్య సేవలపై వీడియో సమావేశం ద్వారా సమీక్షించిన రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రా రెడ్డి.

ప్రచురణార్థం

*మన ఊరు మన బడి, వైద్య, ఆరోగ్య సేవలపై వీడియో సమావేశం ద్వారా సమీక్షించిన రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రా రెడ్డి.*

మహబూబాబాద్, మే -02:

పాఠశాలలకు సెలవులు ఉన్నందున మన ఊరు మన బడి మొదటి దశ పనులు మంజూరు చేసుకొని, 30 లక్షల లోపు పనులను గ్రౌండింగ్ పూర్తి చేయాలని, అలాగే జిల్లాలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సంయుక్తంగా తెలిపారు.

సోమవారం హైదరాబాద్ నుండి మంత్రులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఉన్నత స్థాయి అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ లు, జిల్లా విద్యా, వైద్య అధికారులతో వీడియో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ, మన ఊరు మన బడి పనులపై, పాఠశాలలో చేపట్టాల్సిన డైనింగ్ హాల్ పనులకు కవర్ షెడ్డు తో ఏర్పాటు చేసెందుకు రూపోందించిన డిజైన్ నియోగించాలని, పాఠశాలలకు సెలవులు ఉన్న నేపథ్యంలో పనులు త్వరగా ప్రారంభించాలని, ఇంటర్, పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.

జిల్లాలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రులలో మెరుగైన పారిశుద్ధ్యం నిర్వహించాలని, ఆయుష్, 108, 102 అమ్మవడి, ఆలన వాహనం ద్వారా వైద్య సేవలు విస్తృతం చేయాలని, ఆసుపత్రుల్లో త్రాగునీరు, మౌళిక సౌకర్యాలు కల్పించాలని, సాధారణ ప్రసవాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 636 పి.హెచ్.సి.లలో, 232 అర్బన్ హెల్త్ సెంటర్ లలో సీసీ కెమెరాలు రానున్న 15 రోజుల్లో ఏర్పాటు చేసి కలెక్టర్ లకు లింక్ ఇచ్చి పర్యవేక్షణ జరపడంతో పాటు వీడియో చాట్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. వాక్సినేషన్ డ్రైవ్ ఇంప్రూవ్ చేయాలని, ప్రతిరోజు టెస్ట్ లు చేయాలని తెలిపారు. డ్రగ్, ఫుడ్ ఇన్స్పెక్టర్ లకు క్రొత్త కలెక్టరేట్ భవనంలో తప్పనిసరి గదులను కేటాయించాలని అన్నారు. ఈ సందర్భంగా అంశాల పై చర్చించి పలు సూచనలు చేశారు.

*జిల్లా కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ సంబంధిత విద్యా, వైద్య జిల్లా అధికారులతో కలిసి ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు.*

ఈ సందర్భంగా *అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ మాట్లాడుతూ*, జిల్లాలో మన ఊరు మన బడి కార్యక్రమంలో మొదటి దశలో 316 పాఠశాలలు ఎంపిక చేసుకొని 159 పాఠశాలల పనులకు అడ్మినిస్ట్రేషన్ మంజూరు ఉత్తర్వులను ఇచ్చామన్నారు. పాఠశాలలకు కేటాయించిన ప్రత్యేక అధికారుల తో మరొకసారి పరిశీలన జరిపి పనులు పూర్తి చేస్తామన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ హరీష్ రాజ్, జెడ్పీ సి. ఈ. ఓ. రమాదేవి, డి. ఈ. ఓ. ఎం.డి. అబ్దుల్ హై, ఆర్ అండ్ బి ఈ.ఈ. తానేశ్వర్, పి.అర్. ఈ ఈ సురేష్, వైద్య అధికారులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

——————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post