మన జిల్లా నుండి సివిల్ సర్వీసెస్ లో ర్యాంకు సాధించిన గ్రందె సాయికృష్ణను జిల్లా కలెక్టర్ అనుదీప్ అభినందించారు.

మన జిల్లా నుండి సివిల్ సర్వీసెస్ లో ర్యాంకు సాధించిన గ్రందె సాయికృష్ణను జిల్లా కలెక్టర్ అనుదీప్ అభినందించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో సివిల్స్ 293వ ర్యాంకు సాధించిన గ్రందె సాయికృష్ణ కుటుంబ సభ్యులను ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సివిల్స్ ర్యాంకు సాధించి ఈ ప్రాంత విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారని చెప్పారు. కోచింగ్ లేకుండా ఈ ఘనత సాధించడం చాలా హర్షణీయమని చెప్పారు. తల్లిదండ్రులు పిల్లలు అభివృద్ధిలోకి రావాలని ఎంతో కష్టపడతారని వారి కలలను సాకారం చేశారని కొనియాడారు. తల్లిదండ్రులు ప్రోత్సాహం వల్లనే జీవితంలో ఏదైనా సాధించగలమని చెప్పారు. నేను విఫలమైన రోజుల్లో తల్లిదండ్రులు ఎంతో ప్రేరణనిచ్చారని, ధైర్యాన్ని అందించారని వారి ప్రోత్సాహం వల్లనే నేను సాధించగలిగినట్లు చెప్పారు. నాలుగు సార్లు విఫలమైనా పట్టుదలతో కష్టం వచ్చినా తట్టుకుని ప్రయత్నం చేసి విజయం సాధించారని చెప్పారు. సాధించాలన్న తపన, పట్టుదల, ఆసక్తి ఉండాలని, బలవంతంగా పట్టుబడితే రాదని చెప్పారు. మెయిన్స్కు ఏ విధంగా సన్నద్దం అవుతున్నారని అడిగి తెలుసుకుని సలహాలు, సూచనలు అందించారు. పేద ప్రజలకు సేవలందించే పోస్టును ఎన్నుకున్నారని, ప్రజా జీవితంలోకి రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. సివిల్స్ పరీక్షకు లక్షల మంది పోటీ పడుతున్నారని, పోటీలో మంచి ర్యాంకు సాధించారని చెప్పారు. పోస్టు ఏదన్నది ముఖ్యం కాదని, ప్రభుత్వంలో ఎన్నో మంచి పోస్టులున్నాయని, సమాజంలో మంచి గౌరవం సాధించి మన జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

సివిల్ సర్వీసెస్లో ర్యాంకు సాధించిన గ్రందె సాయికృష్ణ మాట్లాడుతూ చిన్నతనం నుండి సివిల్స్ సాధించాలని కోరిక ఉండేదని చెప్పారు. ఎలాంటి కోచింగ్ లేకుండా ఆన్లైన్ ద్వారా సేకరించిన సమాచారంతో సన్నద్ధమైనట్లు చెప్పారు. కొత్తగూడెం పట్టణంలోని సూర్యోదయ పాఠశాలలో విద్యాభ్యాసం జరిగిందని చెప్పారు. కేరళలోని కాలికాట్ మెకానికల్ ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసినట్లు చెప్పారు. సవిల్స్కు సన్నద్ధతలో తమ్ముడు సాకేట్ ఎంతో ప్రోత్సహించారని చెప్పారు. ముంబాయి, హైదరాబాదులో టూలింగ్ ఇంజనీర్గా పనిచేశానని చెప్పారు. తమ కుమారుడు ర్యాంకు సాధించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు తల్లిదండ్రులు నాగలక్ష్మి, శ్రీనివాసరావు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుటుంబ సభ్యులను శాలువా, మెమెంటోలతో ఘనంగా సత్కరించారు.

Share This Post