మన జీవన శైలిలో వ్యాయామానికి కొద్దిపాటి సమయాన్ని కేటాయించడం ద్వారా మానసిక, శారీరక ఉల్లాసంతో నిత్య ఆరోగ్యవంతులుగా ఉంటామని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామానాగేశ్వరరావు పిలుపునిచ్చారు.

ప్రచురణార్ధం

సెప్టెంబరు 18 ఖమ్మం:

మన జీవన శైలిలో వ్యాయామానికి కొద్దిపాటి సమయాన్ని కేటాయించడం ద్వారా మానసిక, శారీరక ఉల్లాసంతో నిత్య ఆరోగ్యవంతులుగా ఉంటామని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామానాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం ఖమ్మం నగరం ఎస్.ఆర్.అండ్. బి.జె.ఎన్.ఆర్ కళాశాలలో ఫ్రీడమ్  రన్ ను నగర మేయర్ పునుకొల్లు నీరజ, పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తో కలిసి వారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశ ప్రధాని పిలుపు మేరకు ఆజాదికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుటున్నామని, ప్రజలందరూ తమ జీవనశైలిలో రోజుకు కనీసం 30 నిమిషాలపాటు వ్యాయామానికి కేటాయించాలని, మనతో పాటు మన పిల్లలను కూడా క్రీడారంగంలో ఆసక్తి కనబర్చేలా చేయడం ద్వారా వారు చిన్నతనం నుండే శారీరక ధృడత్వం కలిగి ఉంటారని కలెక్టర్ అన్నారు.

ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ మనమంతా ప్రతిరోజు 30 నిమిషాల పాటు యోగా వ్యాయామం చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులమవుతామని తద్వారా ఇండియాను ఫిట్గా ఉంచగలమని అన్నారు. అందరికి ఆరోగ్యం ఎంతో ముఖ్యమని, సంపద ఎంత ఉన్నా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ఫ్రీడం రన్ నిర్వహించడం జరిగిందన్నారు.

కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పరందామరెడ్డి, ఎన్.సి.సి అధికారి, నెహ్రూ యువక కేంద్రం కో-ఆర్డినేటర్ అన్వేష్, యువజన సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post