వరంగల్ జిల్లా
నవంబర్ -30.
మన బస్తి మనబడి కార్యక్రమం లో బాగంగా చేపట్టిన పనుల
వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అధికారులను ఆదేశించారు
బుధవారం రోజున క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా
మొగిలిచర్ల లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో మన బస్తి – మనబడి కార్యక్రమంలో భాగంగా పనుల పురోగతిని పరిశీలించారు. పనులు నాణ్యత ప్రమాణాలను చేపట్టాలని, పదవ తరగతి సిలబస్ ,స్పెషల్ క్లాస్ ల గురుంచి విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు. సైన్స్ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్ లను సందర్శించి ప్రదాన ఉపాద్యాయులను అభినందించారు పిల్లల ప్రగతి పై ప్రశ్నలు అడిగి సంతృప్తి తెలియజేశారు. అనుమతి పొందిన పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేసించారు.మధ్యాహ్న భోజన పథకoను పటిష్టంగా అమలు చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి.వాసంతి, ఎంఈఓ చదువుల సత్యనారాయణ, ఏఈ సుధాకర్, హెచ్ఎంలు తదితరులు పాల్గొన్నారు.