హనుమకొండ:29-4-2022
*ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చి కార్పోరేటుకు దీటుగా తీర్చిదిద్దేందుకే మన బస్తీ-మన బడి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది సుబేదారి ప్రభుత్వ పాఠశాలలో మన బస్తీ-మన బడి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు.
👉ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధన చేపట్టాలని, అందుకు కావలసిన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రత్యేక చర్యలు విద్య శాఖ అధికారులు తీసుకుంటున్నారు.
👉గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తోంది.
👉తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించేందుకు ముందుకు కోస్తున్నారు.
👉మన బస్తీ-మన బడి’ కార్యక్రమంలో పాఠశాలల్లో నీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, విద్యుత్, ఫర్నిచర్, పెయింటింగ్, గ్రీన్‌చార్ట్ బోర్డులు, కాంఫౌండ్ వాల్స్, డైనింగ్ హాల్, డిజిటల్ క్లాసులు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు.
👉 వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్య బోధన అమలవుతుంది.
👉రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.7,289 కోట్లతో కార్యక్రమం చేపట్టింది.
👉 తొలి విడుతగా 9,123పాఠశాల్లో 12 రకాల సదుపాయాలు కల్పించేందుకు రూ.3,497 కోట్ల ఖర్చు చేస్తున్నారు.
👉2,500 పాఠశాలలో భోజనశాలలు ఏర్పాటు చేస్తున్నారు.
👉 వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 32 పాఠశాలలో మన బస్తీ-మన బడి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది.