ప్రచురణార్థం
మహబూబాబాద్, ఆగస్ట్ -05:
జిల్లా కలెక్టర్ కె. శశాంక ఆదేశాల ననుసరించి మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఏ. అరుణ దేవిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి.హరీష్ రాజ్ నేడోక ప్రకటనలో తెలిపారు.
జిల్లా కలెక్టర్ కె.శశాంక ఆదేశాలనుసారం మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్యాధికారి డాక్టర్ ఎ. అరుణ దేవిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, వివరాలలోకి వెళితే గత నెల జూలై-22 వ తేదీన మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్స్ డెలివరీ చేయగా, తరువాత నవజాత శిశువు మరణించడం జరిగిందని, నవ జాత శిశువు మరణానికి డాక్టర్ అరుణ దేవి అందుబాటులో లేకపోవడం ద్వారా అందుబాటులో ఉన్న స్టాఫ్ నర్స్ కాన్పు చేయడం వలన పాపకు పేగులు మెడకు చుట్టుకొని శ్వాస అందక మరణించడం జరిగిందని, డాక్టర్ అరుణ దేవి విధుల పట్ల అశ్రద్ధ, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే నవజాత శిశువు మరణించడానికి కారణం అని డాక్టర్ ఏ అరుణాదేవిని సస్పెండ్ చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ ఆదేశించారని, కలెక్టర్ ఆదేశాల మేరకు ఈరోజు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.
జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని డాక్టర్లందరూ 24 గంటలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని, జిల్లాలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వైద్య అధికారులను డి.ఎం.అండ్ హెచ్. ఓ. ఆ ప్రకటనలో తెలిపారు.