మర్రికుంట పాల కేంద్రం సమీపంలో సంత కోసం స్థలాన్ని, ఆయిల్పామ్ తోటలపై క్షేత్ర విజ్ఞాన యాత్రను ప్రారంభించిన పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన 3 తేది:21 9.2021
వనపర్తి

తెలంగాణ ప్రభుత్వం పశు సంపద అభివృద్ధి కొరకు చర్యలు తీసుకుంటున్నదని, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలో మర్రికుం ట పాల కేంద్రం సమీపంలో సంత కోసం స్థలాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పశు సంపద అభివృద్ధి కొరకు చర్యలు తీసుకుంటున్నదని మంత్రి అన్నారు. వనపర్తి జిల్లాలో పశు సంపద అభివృద్ధి చెంది, ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఫర్టిలైజర్ సి.యస్.ఆర్ సౌజన్యంతో ఆయిల్పామ్ తోటలపై రైతులకు క్షేత్ర విజ్ఞాన యాత్రను ఆయన జెండా ఊపి ప్రారంభించారు ఈ యాత్రలో 67 మంది రైతులు రెండు రోజులపాటు పర్యటిస్తారని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, నాగర్ కర్నూల్ యం.పి.పి.రాములు జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, పట్టు పరిశ్రమ శాఖ అధికారి సురేష్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, గొర్రెల సంఘం అధ్యక్షులు కురుమూర్తి, వైస్ చైర్మన్ చంద్రయ్య, రమేష్ స్థానిక కౌన్సిలర్ లు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం పశుసంవర్ధక శాఖ భవనానికి నిర్మాణానికి రూ. 33.5 లక్షలతో చేపట్టే స్థలానికి మంత్రి భూమి పూజ చేశారు. దిశ స్మృతివనం పశుగ్రాస క్షేత్రంను మంత్రి ప్రారంభించి పరిశీలించారు మరియు మొక్కలూ నటినారు.
……….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post