మర్రి గూడ(మాల్)లో గ్రామ భారతి ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ డా.తమిళి సై సౌందర రాజన్

పత్రికా ప్రకటన

Dt:23.12.2021

ఉద్యాన రంగ అభివృద్ధికి కృషి:రాష్ట్ర గవర్నర్ డా.తమిళి సై సౌందర రాజన్ #నల్గొండ జిల్లా మర్రి గూడ(మాల్) లో గ్రామ భారతి ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్. నల్గొండ,డిసెంబర్ 23.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యాన రంగ అభివృద్ధి కి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర గవర్నర్ డా.తమిళి సై సౌందర రాజన్ అన్నారు.గురువారం నల్గొండ జిల్లా మర్రిగూడ(మాల్) లో కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన యూనివర్సిటీ కి అనుబంధం గా ఏర్పాటు చేసిన గ్రామ భారతి ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలను రాష్ట్ర గవర్నర్ డా.తమిళి సై సౌందర రాజన్ ప్రారంభించారు.అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమం లో రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ రైతు దినోత్సవం సందర్భంగా మర్రిగూడ గ్రామానికి రావడం చాలా సంతోషం గా ఉందని అన్నారు.కేంద్ర ప్రభుత్వం 2021-22 సంవత్సరానికి ఉద్యాన రంగ అభివృద్ధి కి 2250 కోట్ల రూ.లు కేటాయించి ప్రణాళికలు అమలు చేస్తోందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనం పెంపొందించేందుకు హరిత హారం కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు.భారత ప్రధాన మంత్రి దేశ ఆర్థిక వ్యవస్థ కు ఊత మిచ్చేలా వ్యవసాయ, ఉద్యాన రంగ అభివృద్ధి కి సమగ్ర దృక్పథం తో ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు, ఉద్యాన పంటలకు ప్రోత్సాహం కల్పిస్తున్నట్లు తెలిపారు.ప్రభుత్వ ఉద్దేశ్యం ననుసరించి ఉద్యాన పాలిటెక్నీక్ కళాశాల గ్రామీణ విద్యార్థులకు ఉపయోగ పడుతుందని అన్నారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి కరోనా థర్డ్ వేవ్ ఓమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అందరూ సామాజిక దూరం పాటిస్తూ,మాస్క్ లు ధరించి,పరి శుభ్రత పాటించాలని, పండుగల ను కరోనా జాగ్రత్త లు పాటిస్తూ జరుపు కోవాలని,ప్రతీ ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.మర్రిగూడ గ్రామం లో 95 శాతం వ్యాక్సినేషన్ పట్ల అభినందిస్తూ, మొదటి డోస్ వేయించుకున్న వారు నిర్దేశిత గడువు లోగా రెండవ డోస్ వేయించు కోవాలని సూచించారు.ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మునుగోడ్ శాసన సభ్యులు కె.రాజ గోపాల్ రెడ్డి,అదనపు కలెక్టర్ లు రాహుల్ శర్మ, వి.చంద్రశేఖర్, సూర్యా పేట ఎస్.పి.రాజేంద్ర ప్రసాద్, కొండా లక్ష్మణ్ బాపూజీ విశ్వ విద్యా లయం వి.సి.డా.బి.నీరజ ప్రభాకర్,పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్,ఆర్.డి.ఓ.గోపి రాం, జిల్లా ఉద్యాన శాఖ అధికారిణి సంగీత లక్ష్మీ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, ఏ.డి.హుస్సేన్ బాబు, మాతా నిర్మల యోగ భారతి, గ్రామ భారతి గౌరవ అధ్యక్షులు పాలాది మొహనయ్య,చైర్మన్ స్తంభాద్రి రెడ్డి,సెక్రెటరీ సూర్య కళ తదితరులు పాల్గొన్నారు.

Share This Post