మర, చేనేత మగ్గాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్

సిరిసిల్ల, 30 అక్టోబర్, 2021

సిరిసిల్లలోని మరమగ్గాలు, చేనేత మగ్గాలను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

శనివారం కలెక్టర్ సిరిసిల్ల పట్టణం వెంకట్రావునగర్ లోని మరమగ్గాలను సంబంధిత జౌళి శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.

వార్పింగ్ యూనిట్ మరియు మరమగ్గాల ద్వారా వస్త్ర ఉత్పత్తి, డైయింగ్ యూనిట్లను పరిశీలించి, విభాగాల వారిగా యజమానులతో, కార్మికులతో మాట్లాడి ప్రస్తుత స్థితి గతులను తెలుసుకున్నారు.

అనంతరం సిరిసిల్ల చేనేత పారిశ్రామిక సహకార సంఘంను పరిశీలించి చేనేత మగ్గాలపై వస్త్ర ఉత్పత్తి, వారికి ప్రభుత్వం నుండి అందే వివిధ పథకాల గురించి కార్మికులతో ముచ్చటించారు.

అనంతరం తంగళ్ళపల్లి మండలం టెక్స్ టైల్ పార్క్ లోని వివిధ యూనిట్లను సందర్శించి ఆధునాతన రేపియర్ మరమగ్గాల ద్వారా జరిగే వస్త్ర ఉత్పత్తి విధానాన్ని పరిశీలించారు, అలాగే తంగళ్ళపల్లి లోని ప్రాసెసింగ్ యూనిట్ ను సందర్శించి ఉత్పత్తి అయిన క్లాత్ యొక్క ప్రాసెసింగ్ చేసే విధానం ను తెలుసుకున్నారు.

ఈ సందర్శనలో కలెక్టర్ వెంట చేనేత & జౌళి శాఖ సహాయ సంచాలకులు యం. సాగర్, డెవలప్ మెంట్ అధికారులు పి. రవీందర్, MA అజహర్ వహాబ్, కమ్యూనిటి ఫెసిలిటేటర్స్, మరమగ్గాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post