మలక్ పేటలోని దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ భవన్ లో ఘనంగా లూయిస్ బ్రేయిలి 213 జయంతి వేడుకలు

మలక్ పేటలోని దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ  భవన్ లో ఘనంగా వర్చువల్ పద్ధతి లో లూయిస్ బ్రేయిలి 213 జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా  హాజరైన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ , రాష్ట్ర దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ  ఛైర్మన్  డాక్టర్ కె.వాసుదేవరెడ్డి .

ముందుగా నేషనల్ సెన్సార్ పార్క్ లోని లూయిస్ బ్రేయిలి విగ్రహానికి పూలమాల వేసిన మంత్రి కొప్పుల, ఛైర్మన్ వాసుదేవరెడ్డి.

అనంతరం కార్యాలయంలో వర్చువల్ మీటింగ్ లో మాట్లాడడం జరిగింది. మంత్రి , చైర్మన్ , అధికారులు పాల్గొన్నారు.

అంధులకు లూయిస్ బ్రేయిలి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

నూతన బ్రేయిలి క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది.

అనంతరం బ్రెయిలి జయంతి సందర్భంగా కేకు కటింగ్ చేయడం జరిగింది.

కొంత మంది అంధులకు ల్యాప్ టాప్స్ ను అందించారు.

లూయిస్ బ్రేయిలి జన్మదినం సందర్భంగా

దివ్యాంగులకు పలు వరాలు ప్రకటించిన మంత్రి కొప్పుల.

*వచ్చే లూయిస్ బ్రేయిలి జయంతి నాటికి ప్రస్తుతం ఉన్న విగ్రహం స్థానంలో మరింత విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తానని మంత్రి కొప్పుల తనంతట తాను ప్రకటించారు*

మంత్రి ప్రకటన పట్ల దివ్యాంగులు చప్పట్లు కొట్టి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

*మలక్ పేట దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ కార్యాలయ ఆవరణలో ఆడిటోరియం నిర్మాణం చేపడుతామని హామీ ఇవ్వడం జరిగింది*.

*కరీంనగర్ బధిరుల (మూగ, చెవిటి) పాఠశాలను జూనియర్ కాలేజీగా అప్ గ్రేడ్ చేస్తామని తెలిపారు*

*దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి తగు చర్యలు చేపడతామని చెప్పారు.*

*ట్రైనింగ్ కం ప్రొడక్షన్ సెంటర్( టీసిపిసి)  సెంటర్స్ ను బలోపేతం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తాం*

తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా కృషి చేస్తున్నదని వివరించారు.కొందరు నాయకులు అనవసరమైన విమర్శలకు స్వస్తి చెప్పి ఇతర రాష్ట్రాలకు  వెళ్లి అక్కడ పరిశీలించాలని మంత్రి సూచించారు.

చైర్మన్ వాసుదేవరెడ్డి మాట్లాడుతూ,

చీకటిలో వెలుగును ప్రసాదించిన గొప్ప వ్యక్తి లూయిస్ బ్రేయిలి.

వాలెంటెన్ హవె తొలిసారి ప్రాన్స్ లో 1784 సం.రములో అంధుల కోసం మొదటి పాఠశాలను స్థాపించారు.

భారతదేశంలో 1884లో డెహ్రాడూన్ లో స్థాపించారు.

వైకల్యం శరీరనికే కానీ మనస్సు కాదు నిరూపించిన వ్యక్తి లూయిస్ బ్రేయిలి.

6 చుక్కలతో ఉబ్బెత్తు అక్షరాలను లిపి రూపంలో అందించిన అంధుల ఆరాధ్యుడు లూయిస్ బ్రేయిలి.

బ్రేయిలి లిపిలో తెలంగాణ ప్రభుత్వం,దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ ఒకటి నుంచి తరగతి నుండి 10వ తరగతి  వరకు ఉచితంగా అంధులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేస్తున్నామన్నారు.

ఇటీవల దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ ద్వారా రూ.24కోట్లతో అనేక సహాయ ఉపకరణాలు 17వేల మందికి ఉచితంగా అందిస్తున్నామన్నారు.

భవిషత్తులో ఇంకా అనేక సహాయ ఉపకరణాలు అందిస్తామని, దివ్యాంగుల సమస్యలను ఎప్పటి కప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి దివ్యా దేవరాజన్, సంస్థ కమిషనర్ శైలజ,జనరల్ మేనేజర్ ప్రభంజన్ రావు, అంధుల సంఘాల నాయకులు గంగారాం, శ్రీశైలం, దివ్యాంగుల సంఘం నాయకులు             కొల్లి నాగేశ్వర్ రావు, మున్నా తదితరులు పాల్గొన్నారు.

Share This Post