మలిదశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి చాకలి ఐలమ్మ :: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకరరావు

మలిదశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి చాకలి ఐలమ్మ :: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకరరావు

జనగామ, సెప్టెంబర్ 11: తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక, బహుజన బిడ్డ చాకలి ఐలమ్మ జయంతి, వర్థంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేయడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
చాకలి ఐలమ్మ 1895 సెప్టెంబర్ 26వ తేదీన జన్మించారు. 1985 సెప్టెంబర్ 10వ తేదీన మరణించారు.
తెలంగాణ పోరాట యోధులను గుర్తించి, తగిన గౌరవం కల్పించడంలో సీఎం కేసీఆర్ ఎప్పుడు ముందుంటారని మంత్రి అభిప్రాయపడ్డారు.
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలైన వీర వనిత చాకలి ఐలమ్మ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గంలో జన్మించడం నా అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. ఆమె చేసిన సాయుధ పోరాటమే తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అయ్యిందని మంత్రి అన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post