మలేరియా, డెంగ్యూ జ్వరాల పై క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించిన వైద్యాధికారులు…

ప్రచురణార్థం

మలేరియా, డెంగ్యూ జ్వరాల పై క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించిన వైద్యాధికారులు…

మహబూబాబాద్, జూలై-30:

జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏజెన్సీ మండలాలలో మలేరియా డెంగ్యూ వంటి విషజ్వరాలు ప్రబలకుండా అ ముందు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించడంతో వైద్యాధికారులు జిల్లాలో విస్తృతంగా పర్యటించారు.

జిల్లా వైద్యాధికారి హరీష్ రాజు నేతృత్వంలో జిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరును పర్యవేక్షించడం జరిగింది. ప్రధానంగా జిల్లాలోని ఏజెన్సీ మండలమైన గంగారం గూడూరు మండలాలతో పాటు గార్ల మండలం
ముల్క నూర్, తొర్రూరు, దంతలపల్లీ, ఉగ్గం పల్లి, చిన్న గుడుర్, నెల్లికుదుర్ లలో మండల టాస్క్ ఫోర్స్ కమిటీ ఫ్రైడే డ్రై డే కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టారు. నీటి నిల్వ పై అవగాహన కల్పించారు

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి హరీష్ రాజు జిల్లా ఉప వైద్య అధికారి అంబరీష ప్రోగ్రాం అధికారి, మెడికల్ ఆఫీసర్స్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి మహబూబాబాద్ చే జారీ చేయడమైనది

Share This Post