పత్రిక ప్రకటన–2
తేదీ : 16–08–2022
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఘనంగా సామూహిక జాతీయ గీతాలాపన
మల్లారెడ్డి యూనివర్సిటీలో 30 వేల మందితో జాతీయ గీతాలాపన
సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్న మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ హరీష్
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం , రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన మంగళవారం ఉదయం 11.30 గంటలు విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలోని మైసమ్మగూడ బహదూర్ పల్లిలో ఉన్న మల్లారెడ్డి యూనివర్సిటీలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు, రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ హరీష్ తో పాటు యూనివర్సిటీలో ఉన్న 30 వేల పైచిలుకు విద్యార్థులతో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ గీతాలాపన ప్రారంభంకాగానే త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా సామూహిక జాతీయ గీతాలాపన ఈ కార్యక్రమంలో ఏకకాలంలో 30 వేల మంది పైచిలుకు విద్యార్థులతో నిర్వహించినందుకు గాను రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డికి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డును అందించారు. అనంతరం గాలిలోకి బెలూన్లను వదిలి కార్యక్రమాన్ని ముగించారు. ఈ సామాజిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో మల్లారెడ్డి యూనివర్సిటీ సిబ్బంది ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సామూహిక జాతీయ గీతాలాపన విజయవంతం చేసినందుకు మంత్రి హరీశ్రావు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు