మసాంతం వరకు వంద శాంతం వాక్సినేషన్ పూర్తి చేయాలి.. కలెక్టర్ నిఖిల…

మసాంతం వరకు వంద శాంతం వాక్సినేషన్ పూర్తి చేయాలి.. కలెక్టర్ నిఖిల…

కోవిడ్ వాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించి గ్రామాలలో దండోరా వేసి ప్రతి ఒక్కరికి వాహనాలలో వాక్సినేషన్ సెంటర్కు తీడుకోరావాలని, ఈ మసాంతం వరకు 100 శాంతం వాక్సినేషన్ పూర్తి చేయాలని కార్యాచరణ చేపట్టినప్పటికి క్షేత్ర స్థాయిలో అనుకునంత వేగంగా పనులు జరుగకపోవడంతో జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తపరిచారు.

బుధవారం తాండూర్ మున్సిపల్ పరిధిలోని కన్య ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వాక్సినేషన్ సెంటర్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి పనులను పరిశీలించారు. వాక్సినేషన్ కొరకు సెంటర్లో తక్కువ మంది ఉండటం, సెంటర్లలో వాక్సినేటర్లు లేకపోవడంతో సంబంధిత సెంటర్ ఇంచార్జి Dr. భాస్కర్ పై కలెక్టర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వాక్సినేషన్ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. సాయంత్రం 4:00 గంటల నుండి నిర్వహించే కార్యక్రమంలో ఇప్పటి వరకు వాక్సినేషన్ చేసుకొని వారిని సూపర్వైజర్లు వాక్సినేషన్ సెంటర్కు తీసుకోవచ్చి వాక్సినేటర్ లతో వాక్సిన్ వేయించాలన్నారు. ఈరోజు లక్ష్యం మేరకు తాండూర్ మున్సిపల్ పరిధిలోని 36 వాక్సినేషన్ సెంటర్లలో 3500 మందికి మొదటి, రెండవ డోజ్ వాక్సినేషన్ వేసి అట్టి ఫోటోలను తన మొబైల్ కు పంపించాలని ఆదేశించారు.

ఈ సందర్బంగా సెంటర్లో వాక్సిన్ వేయించుకొన్న వారితో కలెక్టర్ మాట్లాడుతూ, కుటంబంలో ఇంకా ఎవరైనా వాక్సిన్ వేయించుకొని వారు ఉన్నారా అని అడిగి తెలుసుకున్నారు. కొందరు వృద్దులు ఉన్నారని తెలుపగా, వరికి కూడా వాక్సిన్ వేయించాలని లేకుంటే వచ్చే ముప్పు వల్ల ప్రమాదం ఏర్పడుతుందని సూచించారు.

అనంతరం పెద్దముల్ మండలం, మంబాపూర్ గ్రామంలోని రైస్ మిల్లు వద్ద గల రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ, యాసంగిలో రైతులందరు వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం FCI ద్వారా ఇకనుండి వరి కొనదని స్పష్టం చేసినందున రైతులు వరి పండించి నష్టపోవద్దని తెలిపారు. దానికి బదులు అరుతడి పంటలైన పెసర, మినుములు, నువ్వులు, వేరుశనగ, జొన్నలు లాంటి పంటలు పందించుకొని లాభాలు పొందాలన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే చిరుధాన్యాలు కూడా పండించుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించిన విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు.

ఈ కార్యక్రమంలో తాండూర్ RDO అశోక్ కుమార్, స్పెషల్ ఆఫీసర్ హన్మంత్ రావు, తహసీల్దార్ చిన్న అప్పలనాయుడు, డా. భాస్కర్, జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, వ్యవసాయ సహాయ సంచాలకులు శంకర్ రాథోడ్, మండల వ్యవసాయ అధికారి బాల కోటేశ్వర్ రావు, డా. ప్రవీణ్ సైంటిస్ట్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post