మహనీయుడు మహర్షి వాల్మీకి – జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్

మహనీయుడు మహర్షి వాల్మీకి – జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్

రామాయణ మహా కావ్యాన్ని రచించి మనకందించిన మహనీయుడు మహర్షి వాల్మీకి అని జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ అన్నారు. వాల్మీకి జయంతి సందర్భంగా బుధవారం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో అధికారికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రతిమ సింగ్, రమేష్ లతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బోయవాడుగా చెడు మార్గం నుంచి దైవికం వైపు మరలి 24 వేల శ్లోకాలతో సంస్కృతంలో రామాయణాన్ని రచించారని, ఇది మన హిందూ ధర్మం, చరిత్ర, సంస్కృతికి ప్రామాణికతగా ఉందని అన్నారు. రామకథ విన్నా, చదివినా పుణ్యం వస్తుందని, ఈ సందర్భంగా ఆ మాహాముని ని మనసారా స్మరించుకొని ముందుకు సాగాలని అన్నారు. భారత దేశం , ప్రపంచం ఉన్నన్ని రోజులు మహర్షి వాల్మీకి చిరస్థాయిగా నిలిచిపోతారని ఆయన చూపించిన భక్తి మార్గంలో అందరు నడిచి దేశాన్ని, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పధంలో ముందుకు తీసుకెళ్లాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డి..ఆర్.డి.ఓ. శ్రీనివాస్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జగదీశ్, డి.ఎస్.ఓ. శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఎస్సి కార్పొరేషన్ ఈ.డి. దేవయ్య, జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజ్, అడిషనల్ డి.ఆర్.డి.ఓ. భీమయ్య , వాల్మీకి బోయ సంఘం జిల్లా అధ్యక్షులు హెచ్. స్వామీ, ఉపాధ్యక్షులు కె.స్వామీ, కార్యదర్శి శ్రీనివాస్, మల్లారీ , తదితర నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post