మహనీయుల త్యాగాలు, పోరాటాలు నేటి తరానికి బాటలు…

ప్రచురణార్థం

మహనీయుల త్యాగాలు, పోరాటాలు నేటి తరానికి బాటలు…

మహబూబాబాద్ సెప్టెంబర్ 27.
తెలంగాణ ఉద్యమ నాయకులు కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి మహనీయుల త్యాగాలు పోరాటాలు నేటి తరానికి బాటలని వారి ఆశయాలకు అనుగుణంగా నేటి యువత నడుచుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు.

సోమవారం కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ ఉద్యమ నాయకులు కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాల వేసి కలెక్టర్ వందనం సమర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశ సంస్కృతిని గొప్పతనాన్ని కాపాడుతూ ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసిన మహనీయులు కొండా లక్ష్మణ్ అని కొనియాడారు

తెలంగాణ కొరకు మంత్రి పదవిని సైతం పొదిలి కట్టుబడి ఉన్నారని అటువంటి మహనీయుల త్యాగాల ఫలితాలు నేటి తరానికి బంగారు బాటలు వేశాయి అన్నారు.

అటువంటి ఆశయ సాధనకు యువతరం కట్టు బడి మహనీయులు చేసిన సేవలను స్మరించుకుంటూ సన్మార్గంలో నడుస్తూ భావితరాలకు స్ఫూర్తి నివ్వాలన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కొమరయ్య జిల్లా అధికారులు పద్మశాలి సంఘ ప్రతినిధులు గద్దె రవి డాక్టర్ పరికిపండ్ల అశోక్ అనుమల వెంకటేశ్వర్లు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
————————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post