మహబూబాబాద్ – అటవి ప్రాంతాల్లో జరిగే అభివృద్ధి పనులకు అటవీ అనుమతులు తప్పనిసరిగా పొందాలి… జిల్లా కలెక్టర్ వీ.పి. గౌతం

ప్రచురణార్థం

అటవి ప్రాంతాల్లో జరిగే అభివృద్ధి పనులకు అటవీ అనుమతులు తప్పనిసరిగా పొందాలి…

మహబూబాబాద్ జూలై 5.

అటవీ ప్రాంతాలలో జరిగే అభివృద్ధి పనులకు ముందస్తుగా అనుమతులు పొందిన తర్వాతనే పనులు మొదలు పెట్టాలని జిల్లా కలెక్టర్ వీ పి గౌతం స్పష్టం చేశారు.

సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వాటర్ గ్రిడ్ వర్క్స్ ఫైబర్ నెట్ వర్క్స్ ఆర్ అండ్ బి పంచాయతీ రాజ్ జాతీయ రహదారులు చేపడుతున్న పనులపై అటవీ అనుమతులు పొందేందుకు గాను జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో చేపట్టిన పనులతో పాటు ప్రస్తుతం చేపట్టబోయే పనులకు తప్పనిసరిగా అటవీశాఖ అనుమతులు పొందిన తర్వాతనే పనులు మొదలు పెట్టాలన్నారు.

మహబూబాబాద్ నుండి నర్సంపేట వెళ్లే జాతీయ రహదారి లో ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ చేపట్ట నున్నందున మిషన్ భగీరథ, ఫైబర్ నెట్ వర్క్ పనులను త్వరితగతిన చేపట్టి ముగించాలి అన్నారు.

గూడూరు, కొత్తగూడ,గంగారం మండలాలు వైల్డ్ లైఫ్( వన్యప్రాణుల ప్రాంతం) గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినందున ఆయా ప్రాంతాల్లో చేపట్టే పనులకు సెక్షన్ 32 క్రింద తప్పనిసరిగా అటవీశాఖ అనుమతులు పొందాలన్నారు అందుకు అధికారులు ఫారం 1 ద్వారా జిల్లా అటవీ శాఖ అధికారులకు ప్రతిపాదనలు అందజేయాలన్నారు. మంజూరైన పనులు వారంలోగా పూర్తిచేయాలని లేనిచో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని తెలియజెప్పారు. పాకాల నుండి ఇల్లందు వరకు చేపడుతున్న రహదారి పనులు జాప్యం జరుగుతున్నందున అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు ఎల్ డబ్ల్యూ ఈ ఈ క్రింద మంజూరైన పనుల ప్రగతి వివరాలు అందజేయాలన్నారు

గూడూరు బయ్యారం గార్ల కొత్తగూడ గంగారం మండలాలలో 2005 అటవీ హక్కు చట్టం క్రింద ధరణిలో పట్టాదార్ పాస్ పుస్తకాలకు దరఖాస్తు చేసుకున్న వారు గిరిజనులై ఉండాలని, 2005 సంవత్సరంకు ముందు నుండి సాగు చేస్తున్న వారే పాసు బుక్కు పొందేందుకు అర్హులని తెలియ చేయాలన్నారు.

ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాదారు పాసు పుస్తకాలు పొందేందుకు సంబంధిత దరఖాస్తు దారులు ఆయా మండలాల తాసిల్దారులతో ప్రతిపాదనలు అందించాలన్నారు.

తాసిల్దార్ లు కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని ఆ తర్వాతనే ప్రతిపాదనలు సమర్పించాలి అన్నారు. కొత్తగా అందజేసే ప్రతిపాదనలు మూడు రోజుల్లోగా సమర్పించాలన్నారు.
గంగారం మండలంలో తిరుమల గండి గ్రామానికి మెటల్ రోడ్డు మంజూరు అవగా 50 శాతం పనులు పూర్తయ్యాయని మరో 50 శాతం పనులు చేపట్టేందుకు మెటల్ రోడ్డును బిటి గా మార్చేందుకు అనుమతులు మంజూరు చేయాలని ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు కోరగా ప్రతిపాదనలు సమర్పించాలి అన్నారు. ఎల్. ఆర్. ఈ.పి.లో బయ్యారం గార్ల మండలాలలో అటవి రెవెన్యూ శాఖల అభ్యంతరం తెలిపిన భూముల వివరాలను పరిశీలిస్తామన్నారు.

ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి రవికిరణ్ భద్రాచలం ,ఏటూరు నాగారం ఐ టి డి ఎ ప్రాజెక్టు అధికారులు గౌతమ్ పోట్రు హనుమంతు కే జండగే ట్రైనీ కలెక్టర్ అభిషేక్ ఆగస్త్య అదనపు కలెక్టర్ కొమరయ్య జిల్లా ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు
————————————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post