మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామం ఎస్సి కాలనీ లో సోమవారం రాత్రి పల్లెనిద్ర చేసిన జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామంలో సోమవారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమాన్ని పురస్కరించుకొని అధికారులు, ప్రజా ప్రతినిధులు తో జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ ఎస్సి కాలనిలో సమావేశం ఏర్పాటు చేసారు.

ఈ సందర్భంగా పల్లె ప్రగతి కార్యక్రమంలో గుర్తించిన సమస్యలను పంచాయతీ సెక్రటరీ అంజదలి సభలో చదివి వినిపించారు.

తొలుత త్రాగునీటిపై సమీక్ష జరిగింది. మిషన్ భగీరథ నీరు సరిపోక స్థానిక వనరులతో నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు.

812 మంది రైతులకు రైతు బంధు అందిందని, 16 రైతు కల్లాలకు గాను 5గురు నిర్మించుకోగా 4గురు చేపట్టారని మిగతా 7గురు రద్దు చేసుకోగా అర్హులైన మరో 10మంది వద్ద దరఖాస్తులు స్వీకరించమన్నారు.

రైతు భీమా 2020కు గాను ఇద్దరి రైతులకు 5 లక్షలు చొప్పున పోతురాజు వెంకన్న, గుగులోత్ బాలు కుటుంబాలకు చెక్ లు అందించామని ఇప్పటి వరకు 8మంది రైతుల కుటుంబాలకు 40 లక్షలు అందివ్వడం జరిగిందని ఏ.ఈ.ఓ. శరణ్య వివరించగా కలెక్టర్ తెలియజేస్తూ 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఏ విధంగా చనిపోయినా భీమా వర్తిస్తుందన్నారు.

విద్యుత్ సమస్య పై ఎలక్ట్రికల్ ఎస్.ఈ.నరేష్ వివరణ ఇస్తూ పల్లె ప్రగతిలో లూజ్ వైర్లు సవరణ చేపట్టామని, 15 పోల్స్ కు 3వ వైరు గుర్తించామని 20 మంది మీటర్లు లేనివారు ఉన్నారని వివరించగా, కలెక్టర్ మాట్లాడుతూ ప్రమాదాలు నివారించేందుకు విద్యుత్ శాఖ ఎస్సి ఎస్టీ లకు తక్కువ ధరకు మీటర్లు బిగిస్తున్నదని, అర్హులైన వారు మీటర్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలాగే 100 యూనిట్ల వరకు విద్యుత్ ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నదన్నారు.

పల్లె ప్రగతిలో చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్నీ వివరిస్తూ 9వేల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించుకోగా 3,500 మొక్కలకు గుంతలు తీయించి మొక్కలు నాటడం జరిగిందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ టేకు మొక్కలు కావాల్సినవారు ఎంతమంది ఉన్నారు అని ప్రశ్నించగా సర్పంచ్ 300 మొక్కలు కావాలని మరో ఇద్దరు 300 చొప్పున కావాలని అడిగినందున టేకు మొక్కలు అడిగిన రైతులకు తప్పక అందిస్తామన్నారు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పై సమీక్ష జరుపుతుండగా జడ్పిటిసి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో 100 నుండి 150 వరకు జాబ్ కార్డ్ లు ఉన్నాయని, మండలం లొనే జాబ్ కార్డ్ సమస్యలు అధికంగా ఉన్నాయని, కార్డ్ దారులకు పనులు నేటికి కల్పించడం లేదని, గతంలో నిర్మించిన కిచెన్ షెడ్ లకు నేటికీ నిధులు చెల్లింపులు జరగలేదని ఫిర్యాదుకు అధికారులు స్పందించి తక్షణం చర్యలు తీసుకుంటామన్నారు.

గ్రామ పరిధిలో 2689 ఎకరాలు భూమి ఉండగా 243 ఎకరాల్లో 106 అటవీ శాఖ అభ్యంతరం తెలిపిందని 137 ఎకరాలు కుటుంబ సభ్యుల సమస్యలు, మరికొన్ని కోర్ట్ కేసులు, 7 ఆర్ ఓ ఆర్ ఉన్నాయని తహసీల్దార్ రఫీ వివరించారు.

కళ్యాణాలక్ష్మి, షాధి ముబారక్ పధకంలో గతంలో 600కు పైగా లబ్ది పొందారని, ప్రస్తుతం 49 దరఖాస్తులు రాగా 29 మంజూరు చేయడం జరిగిందని 20 వివిధ దశల్లో ఉన్నాయన్నారు.

3 రేషన్ షాప్ లు ఉన్నాయని, 864మంది నిత్యావసర వస్తువులు పొందుతున్నారన్నారని వారిలో 61 మంది మృతి చెందినందున వారి కుటుంబ సభ్యులకు మాత్రమే రేషన్ అందిస్తున్నామన్నారు.7 విచారణలో ఉన్నాయన్నారు.

ఫించన్లు 426 మంది పొందుతున్నారని, మరో 33 మందికి 2019 జూలై నుండి ఎంపిక చేసుకుని మంజూరుకు సిద్ధంగా ఉన్నాయన్నారు.

2138 మంది ఓటర్లు ఉండగా పురుషులు 1073, మహిళలు 1065 మంది ఉన్నారన్నారని అధికారులు సభలో ప్రజలకు వివరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యుత్ సమస్యలు తొలగిస్తామని, త్రాగునీరు అపోహలు తొలగిస్తామన్నారు. జూలై 10వ తేదీ లోగా వ్యవసాయానికి 3 ఫేస్ కనెక్షన్లు, అదనంగా లైన్స్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈరోజు గ్రామంలో నే నిద్ర ఇస్తామని పొద్దున్నే సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామన్నారు గ్రామ పంచాయతీ నిధుల ఖర్చుల వివరాలను ఫ్లెక్సీ రూపొందించి ప్రదర్శింప చేస్తామన్నారు గ్రామపంచాయతీలో పారిశుద్ధ్యం హరితహారం ఉపయోగాలను తెలియ చేయాలన్నారు సమాజంలో ప్రతి ఒక్కరు బాధ్యత గా తీసుకొని మూడు వేల లక్ష్యంగా పెట్టుకున్న మొక్కలను ప్రతి ఇంటికి అందజేయాలన్నారు అలాగే ఇంటింటికి ఇచ్చిన 6 మొక్కలను నాటే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు . గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ ట్రాలీ లు ట్యాంకర్లు అందించామని వాటిని వినియోగిస్తూ ఇంటింటికి చెత్త సేకరణ ప్రతిరోజు చేయాలన్నారు సేకరించిన చెత్తను సెగ్రిగేషన్ షెడ్ లో వేరు చేస్తూ వర్మీ కంపోస్ట్ కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు లోతట్టు ప్రాంతాలలో నిలిచిన వర్షపునీరు తొలగించాలని, మొరం పోయి చాలని తెలిపారు నిల్వ ఉన్న నీటిలో దోమలు పెరగకుండా ఉండేందుకు ఆయిల్ బాల్స్ వేయించాలని గంబుషియా చేపపిల్లలను విడిచిపెట్టాలని అన్నారు ఫ్రైడే డ్రై డే కార్యక్రమాలు చేపడుతూ 2018 సంవత్సరంలో డెంగ్యూ జ్వరాలు జిల్లాలోని గార్ల మండలం ఇబ్బందులు ఎదుర్కొన్నద నీ అందుచేత ఇళ్లల్లో నిలువ ఉన్న నీటిలో డెంగ్యూ లార్వా పెరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు గ్రామాల్లో ఏడు కోవిద్ పాజిటివ్ కేసులు ఉన్నాయని హోమ్ క్వారం టైన్ లో ఉన్నట్లు తెలియజేశారు జిల్లాలో 80 సబ్ సెంటర్ల నిర్మాణం చేపట్టగా 20 పూర్తయి వినియోగంలోకి వచ్చాయి అన్నారు గ్రామస్తుల కోరికమేరకు వెంకటాపురం సందర్శిస్తారని పాఠశాల ఉపాధ్యాయులు అంగన్వాడీ కార్యకర్త నియమించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు

ఈ పల్లెనిద్ర కార్యక్రమంలో జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి వి ట్రైనీ కలెక్టర్ అభిషేక్ అగస్త్య జడ్పీ సీఈఓ అప్పారావు డిఆర్డిఎ పిడి సన్యాసయ్య పంచాయతీ అధికారి రఘువరన్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు ఎస్సీ సంక్షేమ అధికారి రాజు తాసిల్దార్ రఫీ ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి సర్పంచ్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు
———————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి మహబూబాబాద్ చే జారీ చేయడమైనది

Share This Post