మహబూబాబాద్ – పల్లెల్లో అభివృద్ధి పనులు చేపట్టక పోతే చర్యలే… జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్

ప్రచురణార్ధం

పల్లెల్లో అభివృద్ధి పనులు చేపట్టక పోతే చర్యలే…

నెల్లికుదురు,
మహబూబాబాద్, జూలై,6.

పల్లెల్లో అభివృద్ధి పనులు చేపట్టకపోతే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ హెచ్చరించారు.

మంగళవారం నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామంలో కలెక్టర్ పల్లెనిద్ర అనంతరం ప్రజా ప్రతినిధులుతో, అధికారులతో గ్రామ అభివృద్ధిని పరిశీలించేందుకు పాదయాత్ర చేశారు

ముందుగా త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు నల్లాల ద్వారా మిషన్ భగీరథ నీటిని విడుదల చేయించారు ట్యాంక్ ప్రక్కన ఉన్న రహదారిని డోజర్ పెట్టి ముళ్ళ కంపలు చెత్తాచెదారం తొలగించి రహదారిని నడిచేందుకు వీలుగా శుభ్రపరిచారు. అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాలు ను సందర్శిస్తూ ప్రజలు బాధ్యతగా తీసుకొని గ్రంథాలయం నిర్వహించ గలిగితే కమ్యూనిటీ భవన పనులను పూర్తి చేయిస్తామన్నారు.

పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు సందర్శకులను ఆకర్షించే చేసేందుకు క్రీడా సామాగ్రి ఏర్పాటు చేయాలని అదేవిధంగా ముందు భాగంలో షటిల్ కోర్టు బ్యాడ్మింటన్ కోర్టు లను ఏర్పాటు చేసి యువతను క్రీడలకు ప్రోత్సహించాలన్నారు.

విద్యుత్ ప్రమాదంలో మరణించిన కుటుంబానికి తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. మరుగుదొడ్లు నిర్మించుకొని వినియోగిస్తున్నారా అని కలెక్టర్ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలకు వెళ్లే పిల్లలకు బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.మురుగు కాలువల్లో పేరుకుపోయిన మట్టిని శ్రమదానం తో తొలగించి ప్రజలకు స్ఫూర్తినిచ్చారు శిధిలమైన భవనాలను తొలగించి క్రీడా స్థలాలుగా ఉపయోగించుకోవాలని అన్నారు. వైకుంఠధామం పనులు పరిశీలిస్తూ వేగవంతం చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి ఎలక్ట్రిసిటీ ఎస్.ఈ. నరేష్, మిషన్ భగీరథ ఇంట్రా అధికారి కృష్ణారెడ్డి గ్రిడ్ అధికారి సురేందర్ ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి తాసిల్దార్ రఫీ ఎస్సీ వెల్ఫేర్ అధికారి రాజు ఎస్సీ కార్పొరేషన్ బాలరాజు గ్రామ సర్పంచ్ ఉంటా డోనికేన జ్యోతి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
—————————————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post