మహబూబాబాద్, మే – 08: మహబూబాబాద్ లోని ఆర్టీసీ బస్ డిపో ను పరిశీలించి , రామగుండాల..ఇల్లందు నూతన బస్ సర్వీసును ప్రారంభించిన రాష్ట్ర గిరిజన , స్త్రీ , శిశు .. సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ,జెడ్పి చైర్ పర్సన్ బింధు , ఎమ్మెల్యే శంకర్ నాయక్

మహబూబాబాద్, మే – 08:  మహబూబాబాద్ లోని ఆర్టీసీ బస్ డిపో ను పరిశీలించి , రామగుండాల..ఇల్లందు నూతన బస్ సర్వీసును ప్రారంభించిన రాష్ట్ర గిరిజన , స్త్రీ , శిశు .. సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ,జెడ్పి చైర్ పర్సన్ బింధు , ఎమ్మెల్యే శంకర్ నాయక్

ప్రచురణార్థం

మహబూబాబాద్, మే – 08:

మహబూబాబాద్ లోని ఆర్టీసీ బస్ డిపో ను పరిశీలించి , రామగుండాల..ఇల్లందు నూతన బస్ సర్వీసును ప్రారంభించిన రాష్ట్ర గిరిజన , స్త్రీ , శిశు .. సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ,జెడ్పి చైర్ పర్సన్ బింధు , ఎమ్మెల్యే శంకర్ నాయక్.

ఈ సందర్భంగా మంత్రి బస్ డిపో లో అన్ని విభాగాలను పరిశీలించారు. సమస్యలను ,డిపో లాభాల్లో నడిచేందుకు తీసుకోవలసిన చర్యలను కార్మికులను అడిగి తెలుసుకున్నారు. అలాగే, ఆర్టీసీ చైర్మన్ , ఎం.డి ల తో ఫోన్ లో మాట్లాడారు. మహబూబాబాద్ ఆర్టీసీ బస్ డిపో ను ఎత్తి వేస్తారని మీడియాలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయని, ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు.

డివిజన్ గా ఉన్నప్పుడే డిపో ను తెచ్చుకున్నాం , డిపో కోసం మేమందరం కృషి చేశామని, కేసిఆర్ గారికి ఆర్టీసీ పై ఉన్న ప్రేమతో నష్టాల్లో కూరుకుపోయినా ట్రెజరీ నుండి జీతాలను ఇచ్చి సంస్థ ను కాపాడుతున్నారన్నారని, లాభాల్లో నడిచేందుకు సిబ్బంది కృషి చేయాలనీ కోరారు.

ఈ సందర్భంగా మంత్రి శాతవాహన కన్నా ముందు మహబూబాబాద్ నుండి హైదరాబాద్ కు ఏ.సి బస్సు ను నడపాలని అధికారులను కోరారు. ప్రజలకు మెరుగైన ,సురక్షితమైన రవాణా కల్పించడానికి, తక్కువ ఖర్చుతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుకునే విధంగా సంస్థను బలోపేతం చేస్తామని, మేమంతా కలిసి కట్టుగా సంస్థను కాపాడుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ బస్ డిపో మేనేజర్ శ్రీనివాస్ నాయక్ , మున్సిపల్ వైస్ చైర్మన్ ఫరీద్ , పిఎసిఎస్ చైర్మన్ మూల. మధుకర్ రెడ్డి, తెరాస నాయకులు కొంపెళ్లి. శ్రీనివాస్ రెడ్డి ,కొమ్మినేని. రవీందర్ , యాళ్ల.మురళీధర్ రెడ్డి ,ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post