మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాలు జిల్లాలో కలెక్టర్ కార్యాలయం లో,జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కార్యాలయం లో బుధవారం ఘనంగా నిర్వహించారు

మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాలు జిల్లాలో కలెక్టర్ కార్యాలయం లో,జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కార్యాలయం లో బుధవారం ఘనంగా నిర్వహించారు.జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరం లో  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వనమాల చంద్ర శేఖర్ లు ఆయన చిత్రపటానికి పూల మాల వేసి ఘనం గా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామాయణ మహా కావ్యాన్ని రచించిన మహనీయుడు మహర్షి వాల్మీకి అని,ప్రతి ఒక్కరు ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమం లో రిటైర్డ్ ఐ. ఏ.ఎస్.అధికారి చోల్లేటి ప్రభాకర్,జిల్లా కలెక్టర్ కార్యాలయం పరిపాలన అధికారి మోతీ లాల్,సిబ్బంది పాల్గొన్నారు.జిల్లా వెనుక బడిన తరగతుల అభివృద్ది శాఖ అధికారిణి కార్యాలయం లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారిణి కృష్ణ వేణి, కార్యాలయ సిబ్బంది మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు

Share This Post