జనగామ, అక్టోబర్ 2: జాతిపిత మహత్మాగాంధీ ఆశయాలను, ఆదర్శాలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు అన్నారు. శనివారం మహాత్మాగాంధీ 152వ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ సమావేశమందిరంలో అదనపు కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి సత్యాగ్రహమే అయుధంగా అహింస, శాంతి మార్గములో స్వాతంత్య్ర సముపార్జన చేసిన మహానీయుడు మహాత్మాగాంధి అని కొనియాడారు. వారు చూపిన మార్గములో పయణించి దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్పి సిఇవో ఎల్. విజయలక్ష్మి, డిఆర్డివో జి. రాంరెడ్డి, డిపివో కె. రంగాచారి, కలెక్టరేట్ ఏవో మురళీధర్ రావు, ఇతర జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.