మహాత్మాగాంధీ ఉపాధిహామీ 2005 పథకం పై మండల అంభివృద్ధి – జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్.

మహాత్మాగాంధీ ఉపాధిహామీ 2005 పథకం పై మండల అంభివృద్ధి అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలి – జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్.
గ్రామీణ పేద ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2005లో ప్రారంభించి 260 రకాల పనులు కల్పించేందుకు మార్గదర్శకాలు జారీ చేయడం జరిగిందని అయితే రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా దాదాపు 95 రకాల పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందులో ఏ పనులు చేపట్టాలి వాటి విధి విధానాలు ఎలా ఉండాలి , మస్టర్ ఎలా చేయాలి, ఎఫ్.టి.ఓ అప్లోడ్ ఎప్పుడు ఎలా చేయాలి అని విషయాలపై పూర్తి అవగాహన కల్పించేందుకు బుధవారం ఉదయం కలెక్టరేట్ ప్రజావాణి హాల్లొ ఎంపిడిఓ లు, ఎపిఓ లు, ఎంపిఓ లకు ప్రొజెక్టర్ ద్వారా శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ పథకం లో పొందుపరచిన అంశాలను పూర్తిగా చదివి అవగాహన చేసుకోవాలన్నారు. అర్థం కాకుంటే అడిగి తెలుసుకోవాలని సూచించారు. జిల్లాలో ఉపాధి హామిలో ఆశించిన స్థాయిలో పని దినాలు కల్పించలేకపోతున్నారని, అదేవిధంగా రోజుకు పడాల్సిన కూలి సైతం తక్కువగా ఉందన్నారు. గ్రామ స్థాయిలో కూలీలకు పని కల్పించడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఏ పనులు చేపట్టవచ్చునో తెలుసుకొని వచ్చే నెల నుండి పని దినాలు పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపిడివోలను ఆదేశించారు. మండల పంచాయితీ అధికారులు, పంచాయతీ సెక్రెటరీలతో సమన్వయం చేసుకొని పనిచేయాలని తెలిపారు. హరితహారంలో నాటిన మొక్కలకు ఇప్పటి వరకు ఇంకా ఎఫ్.టి.ఓ జనరేట్ పూర్తి స్థాయిలో అప్లోడ్ చేయకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో ఎఫ్.టి.ఓ అప్లోడ్ చేసి పనిచేసిన కూలీలకు సకాలంలో డబ్బులు పడే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపిడిఓ లను ఆదేశించారు.
శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ గ్రామంలో ఉపాధి హామీ ద్వారా చేసే పనులు ప్రజల కు ఉపయోగపడే విధంగా ఉండాలని అలాంటి పనులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పథకం చట్టం ను చదివి వాటిని ఎలా అమలు చేయాలి అనేదానిపై దృష్టి పెట్టాలని తెలిపారు. సకాలంలో ఎఫ్.టి.ఓ లు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో పి.డి.డి.ఆర్.డి.ఏ నర్సింగరావు, జడ్పి సి.ఈ.ఓ ఉషా, అడిషనల్ పిడి నటరాజ, డియల్.పి.ఓ లు ఎంపిడివోలు, ఏ.పి.ఓ లు పాల్గొన్నారు.

Share This Post