మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు మౌళిక సదుపాయాలు కల్పించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి- జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు మౌళిక సదుపాయాలు కల్పించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్ సమావేశ హాల్లొ డి.ఈ.ఓ, అన్ని రెసిడెన్షియల్ సంస్థల అధికారులు, జిల్లా సంక్షేమ శాఖ, పి.డి. డి.ఆర్.డి.ఏ, ఎంపీ డిఒపీలతో మౌళిక సదుపాయాల కల్పనపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు ఆయిన మరుగుదొడ్లు, కిచెన్ హాల్, కిచెన్ గార్డెన్, ఇంకుడు గుంతలు, రూఫ్ వాఁటర్ హార్వెస్టింగ్ వంటి మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. అందువల్ల జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో కావాల్సిన మౌళిక వసతులపై వెంటనే డి.ఆర్.డి.ఓ కు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. అదేవిధంగా ఎంపిడివో లు తమ మండల పరిధిలోని విద్యాలయాలకు కావ్సల్సిన మౌళిక సదుపాయాల నివేదిక తీసుకొని వెంటనే ఆన్లైన్ ద్వారా నమోదు చేసి వర్క్ ఆర్డర్ జనరేట్ చేయాలని సూచించారు. స్కూల్ విద్యా కమిటీల ద్వారా నిర్మాణ పనులు చేపట్టాలని వీటన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిదంగా న్యూట్రీగార్డెన్ ఏర్పాటు పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. బాగా చేసిన న్యూట్రీగార్డెన్ లకు గుర్తించి బహుమతులు ప్రధానం చేయడం జరుగుతుందని తెలియజేసారు. ఎంపిడివోలు గ్రామాల్లో నర్సరీల ఏర్పాటు పై దృష్టి పెట్టాలని ఇప్పటి వరకు కొన్ని చోట్ల బ్యాగ్ ఫిల్లింగ్ చేయలేదని వెంటనే ఫిల్లింగ్ పూర్తి చేసి విత్తనాలు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో అసనపు కలెక్టర్ మను చౌదరి, పి.డి. డి.ఆర్.డి.ఏ నర్సింగ్ రావు, డి.ఈ.ఓ గోవింద రాజు, సంక్షేమ శాఖ అధికారులు అనిల్ ప్రకాష్, రాంలాల్, అశోక్, జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి వెంకటలక్ష్మి, ఎంపిడివో లు, మండల విద్యా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post