మహాత్మా  గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా అందరం కలిసి కృషి చేయాలి – కలెక్టర్ అమోయ్ కుమార్

శనివారం మహాత్మా గాంధీజీ 152వ జయంతి సందర్భంగా కలెక్టరేట్ లో కలెక్టర్
అమోయ్ కుమార్ బాపూజీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు
అర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో అహింస
మార్గమును ఎంచుకొని స్వాతంత్ర్యం సాధించారన్నారు. విదేశీ వస్తువులు
బహిష్కరణ చేయాలని పిలుపునిచ్చారని మహాత్మా  గాంధీజీ కలలు కన్న గ్రామ
స్వరాజ్యం సాధించే దిశగా అందరం కలిసి కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో  అదనపు కలెక్టర్ తిరుపతి రావు, డిఆర్ఓ హరిప్రియ, ఎఓ
ప్రమీల, పరిశ్రమల శాఖ అధికారి రాజేశ్వర్ రెడ్డి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు
.

Share This Post