మహాత్మా గాంధీజీ స్మరణ తో పాటు వారి సందేశంను ప్రతి ఒక్కరూ ఆచరించాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

మహాత్మా గాంధీజీ స్మరణ తో పాటు వారి సందేశంను ప్రతి ఒక్కరూ ఆచరించాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
——————————
:

జీవితాన్ని, సత్యం, అహింసల జీవనవ్రతంగా సాగించి తన జీవితమే తన సందేశంగా మలుచుకున్న గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీజీ అని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. వారిని నిత్యం స్మరించుకుంటూనే వారి ఆశయాలను ఆచరణలో పెడితేనే మహాత్ముడికి మనమిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

జాతిపిత మహాత్మా గాంధీ 153వ జయంతినీ పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ IDOC లోని మహాత్ముడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిరిసిల్ల పట్టణం గాంధీ చౌక్ లోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ..
ఈ రోజు మహాత్మా గాంధీ పుట్టిన రోజు వేడుకలతో పాటు అంతర్జాతీయ అహింస దినోత్సవంను కూడ జరుపుకుంటున్నామని తెలిపారు.
అహింస, సత్యాగ్రహమనే సిద్ధాంతాలను ఆచరించి విజయం సాధించి చూపటం ద్వారా ప్రపంచానికి సరికొత్త పోరుబాటను మహాత్మా గాంధీ పరిచయం చేశారని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. అహింస, సత్యాగ్రహo చిరకాలం ఉంటాయన్నారు.

మంచి సమాజం నిర్మాణంకు గాంధీజీ తపించేవారని వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలన్నారు.

కార్యక్రమంలో ఆర్డీఓ టి శ్రీనివాస్ రావు, డిపిఆర్ఓ మామిండ్ల దశరథం, మున్సిపల్ ప్రజారోగ్య ఉప కార్యనిర్వహక ఇంజనీర్ ప్రసాద్, తహశీల్దార్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
——————————–

 

Share This Post