* ప్రచురణార్థం *
జయశంకర్ భూపాలపల్లి అక్టోబర్ 2 (శనివారం).
మహాత్మా గాంధీ అనుసరించిన సత్యాగ్రహం-అహింస పద్ధతులు ఎప్పటికీ అనుసరణీయమని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని శనివారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ టిఎస్. దివాకరతో కలిసి గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత స్వతంత్ర సంగ్రామంలో పాలుపంచుకుంటున్న నేతలందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చి తన ప్రసంగాల ద్వారా భారతదేశ స్వాతంత్ర ఆవశ్యకతను తెలియచేసి దేశంలోని ప్రజలందరినీ స్వాతంత్ర సంగ్రామంలో భాగస్వాములను చేసి తన అహింస, సత్యాగ్రహం అనే సిద్ధాంతాలతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అధిపతులతో శాంతియుతంగా పోరాటం సాగించి దేశ స్వాతంత్రం సాధనలో ప్రధాన పాత్ర పోషించిన మహాత్మా గాంధీ భారతదేశ ప్రజల గుండెలలో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఆయన ప్రబోధించిన శాంతి-అహింస పద్ధతులు ప్రపంచ మానవాళి శాంతియుతంగా జీవించడానికి ఎప్పటికీ అనుసరణీయమని అన్నారు. యువత గాంధీజీ బాటలో నడిచి ప్రపంచ శాంతికి కృషి చేయాలని అన్నారు. అలాగే మహాత్మాగాంధీ స్ఫూర్తితో గ్రామాలు సంపూర్ణంగా అభివృద్ధి చెందేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాయని వాటిని సక్రమంగా ప్రజలకు అందించేందుకు అధికారులంతా కృషిచేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో నీతి అయోగ్ అండర్ సెక్రెటరీ. అజయ్ జోషి, సిపిఓ. శామ్యూల్, డిఆర్డిఓ. పురుషోత్తం, జెడ్పీ సీఈవో. శోభారాణి, డిపిఓ.ఆశాలత, డిపిఆర్ఓ. రవికుమార్, డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్. శ్రీరామ్, గిరిజన సంక్షేమశాఖ ఇఇ హేమలత, కలెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్లు శ్రీనివాస్, రవి కుమార్, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయడమైనది.