మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : జిల్లా కలెక్టర్ బి. గోపి

జిల్లా ప్రభుత్వ యంత్రాంగం మరియు నెహ్రూ యువ కేంద్ర వరంగల్ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో అజాదిక అమృత్ మహోత్సవ్ కార్యక్రమం లో భాగంగా క్లీన్ ఇండియా ప్రోగ్రాం ఈ నెల అక్టోబర్ 1వ తారీకు నుండి 31 వ తారీకు వరకు దేశవ్యాప్తంగా 744 జిల్లాల్లో కొనసాగనుంది.

ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో ఈరోజు ఉదయము 11:30 గంటలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ బి .గోపి,జిల్లా అధికారులతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి నెహ్రూ యువ కేంద్ర యువజన అధికారి చింతల అన్వేష్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.గోపి మాట్లాడుతూ మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతవనిని నిర్మించాలని, ప్రధానంగా జిల్లాలో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రతను పెంపొందించుటకు కృషిచేయాలనీ , జిల్లాలోని ప్రతి గ్రామం నుండి కనీసం 30 కేజీల ప్లాస్టిక్ ను సేకరించాలని, వరంగల్ జిల్లా ను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్లాస్టిక్ మూలంగా వచ్చే అనర్థాలను, పర్యావరణానికి హాని కలిగించే విధానాన్ని గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు.

అన్ని ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు మహిళా సంఘాలు, వీధి వ్యాపారులు, వాకర్స్ అసోసియేషన్లు ప్లాస్టిక్ ను ఏరివేసే ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, పార్కులు, రోడ్లు, వ్యాపార సముదాయాలు, కాలువలు లాంటి ప్రదేశాలలో ఏలాంటి ప్లాస్టిక్ వ్యర్దాలు లేకుండా చేయాలని చెప్పారు. అక్టోబర్ నెలలో నిర్వహించవలసిన యాక్షన్ ప్లాన్ గురించి జిల్లా యువజన అధికారి అన్వేష్ పీపీటీ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా క్లీన్ ఇండియా ప్రచార పోస్టర్ లను కలెక్టర్ మరియు ఇతర అధికారుల చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ హరి సింగ్, జిల్లా పరిషత్ సీఈఓ రాజారావు, DEO వాసంతి, DM &HO డాక్టర్ వెంకటరమణ, ఎంజీఎం సూపరిండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, జాతీయ యువజన అవార్డు గ్రహీతలు మండల పరశురాములు మరియు డాక్టర్ ఆకుల పల్లి మధు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, నెహ్రూ యువ కేంద్ర వాలెంటర్ల్లు భరత్ వీర్, వంశీ, నక్క భరత్, అపార్ట్మెంట్స్ అసోసియేషన్స్, పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Share This Post