మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మీద భువనగిరి , బీబీనగర్, బొమ్మలరామరం మండలాలకు చెందిన MPDOs, MPos, APOs, EC, TAs, పంచాయతీ సెక్రటరీలకు ఒక రోజు శిక్షణా కార్యక్రమం భువనగిరి రైతు వేదిక (మాస్ కుంట) లో నిర్వహించడం జరిగింది.

కార్యక్రమానికి జిల్లా స్థానిక సంస్థల  అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ  హాజరై శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలలో అనేక పనులను కల్పించవచ్చు నని, ముఖ్యంగా జలశక్తి అభియాన్  (JSA) కల్పించాలని సూచించారు.
ప్రతి గ్రామానికి 30 మంది కూలీలకు తగ్గకుండా పనులను కల్పించాలని, హరిత హారంలో చేసిన వివిధ ప్లాంటేషన్లు , ప్రకృతి వనాలలో వాచర్ వనసేవకులు నర్సరీ పనులలో సాధ్యమయినంత ఎక్కువ మందికి పనులు కల్పించాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన వారిని సహించేది లేదని హెచ్చరించారు. పంచాయతి కార్యదర్శులు సమయపాలన పాటించి ప్రతి గ్రామములో పనులు కల్పించాలని.  గ్రామాల పారిశుధ్యం విషయంలో శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రతి ఇంటి నుండి చెత్తను పొడి తడి చెత్త విడిగా సెగ్రిగేషన్ షేడ్ కి తరలించి చెత్త నుండి ఎరువును తయారు చేయాలని సూచించినారు. ప్రగతిలో ఉన్న బృహత్ పల్లె ప్రకృతి  ప్రకృతి వనాలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అన్ని గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చి దిద్దేదుకు కృషి చేయాలని సూచించారు. చెత్తరహిత,  ప్లాస్టిక్ వ్యర్థాల రహిత గ్రామాలుగా తీర్చి దిద్దాలని సూచించారు.
కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీ యాదగిరి పాల్గొన్నారు

Share This Post