మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ (MGNCRE) జూమ్ మీటింగ్ : MGNCRE తెలంగాణ కో-ఆర్డినేటర్ శిరీష ప్రసాద్, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన తేది:7.8.2021
వనపర్తి.
స్వచ్ఛ కార్యాచరణ ప్రణాళిక (Swaccha Action Plan) కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని స్వచ్ఛ జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని MGNCRE తెలంగాణ కో-ఆర్డినేటర్ శిరీష ప్రసాద్ అన్నారు.
శనివారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జూమ్ మీటింగ్ ద్వారా జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆ ఫ్ రూరల్ ఎడ్యుకేషన్ (MGNCRE) తెలంగాణ కోఆర్డినేటర్ మాట్లాడుతూ స్వచ్ఛ యాక్షన్ ప్లాన్ ఆధ్వర్యంలో ” One District, One Green Champion-2021″ వర్క్ షాప్ క్రింద తెలంగాణ రాష్ట్రం నుండి 18 కళాశాలలు పాల్గొనగా, అందులో వనపర్తి జిల్లా నేషనల్ అవార్డు గెలుచుకున్నదని ఆమె తెలిపారు.
ఉన్నత పాఠశాలలు, కళాశాలల ప్రాంగణంలో పారిశుద్ధ్యం, పచ్చదనం, రీసైక్లింగ్ వంటి కార్యక్రమాలు చేపట్టి స్వచ్ఛ గ్రామాలుగా, పట్టణాలుగా తీర్చిదిద్దాలని ఆమె అన్నారు. పచ్చదనం పెంపొందించుటకు స్వచ్ఛ క్యాంపస్ ను ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు.
జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలు చొరవ తీసుకుని పచ్చదనంపై దృష్టి సారించాలని ఆమె అన్నారు. జాతీయ స్థాయి అవార్డు రావడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, కళాశాల ప్రిన్సిపల్ సురేష్, ఎన్ ఎస్ ఎస్. ప్రోగ్రాం అధికారులు పి శ్రీనివాస్, పుష్ప, వైస్ ప్రిన్సిపల్ కృష్ణమూర్తి, వెంకట ప్రసాద్, శ్రీనివాస రెడ్డి, సత్యమ్మ తదితరులు పాల్గొన్నారు.
………
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post