మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా అమర వీరులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, జిల్లా అధికారులు

పత్రికా ప్రకటన.     తేది:30.01.2023, వనపర్తి.

ప్రభుత్వ ఆదేశాల మేరకు, స్వాతంత్ర్యం సిద్దించుటకు ప్రాణాలను అర్పించిన మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా అమర వీరులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించినట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు.
సోమవారం ఐ.డి. ఓ.సి. కార్యాలయంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి జిల్లా కలెక్టర్ రెండు నిమిషాలు మౌనం పాటించటం జరిగిందని ఆమె తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహాత్మా గాంధీ, అమర వీరులకు స్మరిస్తూ వారి ఆశయాలను మనం తప్పక పాటించాలని ఆమె సూచించారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలం చేత మనకు స్వాతంత్ర్యం సిద్ధించిందని ఆమె గుర్తు చేశారు.
అనంతరం వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో “కుష్ఠు  వ్యాధి నివారణ దినోత్సవం” సందర్భంగా జిల్లా అధికారులు, సిబ్బందిచే ప్రతిజ్ఞ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుష్ఠు వ్యాధి గ్రస్తులకు చేయూత అందించాలని, వారిపై వివక్ష చూపరాదని ఆమె అన్నారు. కుష్ఠు వ్యాధిపై విస్తృత ప్రచారం కల్పించాలని, వారిని గుర్తించి దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రులలో చేర్పించాలని ఆమె సూచించారు. కుష్ఠు వ్యాధి వున్న వారికి శరీరంపై మచ్చలు ఉండి, అవి మొద్దుబారి ఉన్నట్లైతే వాటిని కుష్ఠు వ్యాధి లక్షణాలుగా గుర్తించి, వారికి వెంటనే చికిత్స అందించాలని ఆమె తెలిపారు. కుష్ఠు వ్యాధికి చికిత్స ఉన్నదని, వారిపై వివక్ష చూపరాదని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్.లోకనాథ్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్బాన్, (రెవెన్యూ) డి. వేణుగోపాల్, జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
……..
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post