మహాత్మా జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్

మహాత్మా జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్
  • *మహాత్మా జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్*

హనుమకొండ:-

(కె.యు క్యాంపస్)

సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడు జ్యోతీరావ్ గోవిందరావ్ ఫులే వర్ధంతిని పురస్కరించుకుని ఆయన సేవలను చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ కొనియాడుతూ యూనివర్సిటిలోని దూరవిద్య కేంద్రం వద్ద గల ఫులే విగ్రహానికి విద్యార్థులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు…. 

అనంతరం ఆయన ఫులే సేవలను స్మరిస్తూ మాట్లాడారు…

● మహనీయులు మహాత్మ జ్యోతిరావు ఫులే ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని చీఫ్ విప్ అన్నారు..

● మహాత్మ జ్యోతిరావు ఫులే ఆలోచన స్పూర్తితో తెలంగాణ రాష్ట్ర విద్యా విధానం కొనసాగుతుందని ఆయన అన్నారు… రాష్ట్రం ఏర్పడే నాటికి 19 బీసీ గురుకులాలు ఉండగా సాధించుకున్న రాష్ట్రంలో పలు దశలుగా నేటికి 310 బీసీ గురుకులాలు తెలంగాణలో స్థాపించుకుని నాణ్యతతో కూడిన విద్యను అందిస్తున్నామని చీఫ్ విప్ అన్నారు..

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో విశేష కృషి చేస్తుందని ఆయన అన్నారు..

● కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బీసీలను అనాదిగా మోసం చేస్తోందని విమర్శించారు… బీజేపీ పార్టీకి ఓబీసీ శాఖ ఉంటుంది కానీ కేంద్ర క్యాబినెట్ లో ఓబీసీలకు మంత్రిత్వ శాఖ ఉండకపోవడం హేయనియమని చీఫ్ విప్ అన్నారు…

 

● బీసీ కులల తమ జనాభా లెక్క తెలిపేందుకు కుల జనాభా గణన చేయాలని పలు బీసీ సంఘాలు కోరుతున్నప్పటికి కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గు చేటు అని అన్నారు…

● తెలంగాణ రాష్ట్రం బీసీల అభ్యున్నతికి పాటు పడుతుంటే…కేంద్ర ప్రభుత్వం మాత్రం బీసీల హక్కులకు తూట్లు పొడుస్తుందని ఎద్దేవా చేశారు…

● తక్షణమే కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖను మరియు బీసీ కులగణను చేపట్టాలని డిమాండ్ చేశారు..

ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్, యువజన నాయకులు బొల్లికొండ వీరేందర్,టిఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల శరత్ చంద్ర,సీనియర్ నాయకులు పాలమకుల కొమురయ్య, యూనివర్సిటీ అధ్యక్షులు బైరపక ప్రశాంత్,జిల్లా కో ఆర్డినేటర్ అరూరి రంజిత్ కుమార్,సీనియర్ నాయకులు కలకోట్ల సుమన్,కొనుకటి ప్రశాంత్,పిన్నింటి విజయ్ కుమార్,దగ్గుల వినోద్,వీరగని ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.                                     

Share This Post