మహారాష్ట్రం నుంచి వచ్చిన వలస కూలీలతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు మాట్లాడారు

21

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం సురారం గ్రామంలో మహారాష్ట్రం నుంచి వచ్చిన వలస కూలీలతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు మాట్లాడారు. వారికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, వారు ఆకలితో అలమటించకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ MV రెడ్డి IAS గారికి సూచించారు. ఏ గ్రామంలో కూడా వలస కూలీలు ఇబ్బందులు పడవద్దని కోరారు. ప్రభుత్వం ఒక మనిషి 12 కిలోల బియ్యం, 500 రూపాయలు అందించాలని కలెక్టర్ MV రెడ్డి IAS గారికి సూచించారు. ఏ గ్రామంలో కూడా వలస కూలీలు ఇబ్బందులు పడవద్దని కోరారు.ఎక్కడ ఎలాంటి అవాంతరాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ను ఆదేశించారు. లాక్ డౌన్ పూర్తి అయ్యే వరకు ఎవరు ఎక్కడికి వెళ్లరాదని మీరు సహకరించాలని వలస కూలీలను మంత్రి పువ్వాడ గారు కోరారు.

Share This Post