మహిళలందరికి బతుకమ్మ చీరలను అందించాలి : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు

– రేపటి నుండి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమం జరిగేలా చూడాలి
– మహిళలు మెచ్చేలా 19 రంగులు, 17 డిజైన్లతో కలిపి మొత్తం 810 వర్ణాలలో సరికొత్తగా బతుకమ్మ చీరలు సిద్ధం
– ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో పండుగావాతావరణంలో బతుకమ్మ చీరల పంపిణి జరగాలి
– మహిళలందరికీ బతుకమ్మ చీరలు పంపిణి అయ్యేలా చూడాలి

– మూడు రోజుల్లో బతుకమ్మ చీరలు పంపిణి ప్రక్రియ పూర్తికావాలి

– అధిక వర్షాలతో జలాశయాలు ,చెర్వులు నిండుకుండలను తలపిస్తున్న నేపథ్యంలో బారికేడింగ్ తో సహా తగిన రక్షణ జాగ్రత్తలు తీసుకోవాలి

– చెరువుల అలుగుల పై పేరుకుపోయిన పాకురు , నాచు తో ప్రజలు జారిపడే అవకాశం ఉన్న దృష్ట్యా పాకురు , నాచు లను తొలగించాలి
– పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ చైర్మన్ , మున్సిపల్ కమి షనర్ లు , కౌన్సిలర్ లు , గ్రామీణ ప్రాంతాల్లో mptc , సర్పంచ్ , కార్యదర్శి లు వేడుకల నిర్వహణకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలి
– పోలీస్ లు సిసి కెమెరాల ను ఏర్పాటు చేసి వేడుకల్లో అవాంచనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

– కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ వేడుకలు జరిగేలా చూడాలి
– అన్ని గ్రామాలు , పట్టణాల్లో కరోనా వాక్సినేషన్ వందశాతం పూర్తి చేయాలి
– వాక్సినేషన్ వందశాతం పూర్తైన గ్రామాల్లో పూర్తయినట్లు తెలిపే బోర్డులు పెట్టాలి

అక్టోబర్ 5వ తేదీ నుంచి బతుకమ్మ పండగ ప్రారంభం కానున్న నేపథ్యంలో సిద్ధిపేట జిల్లాలో తెల్లరేషన్ కార్డు కలిగి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ప్రభుత్వం కానుకగా అందించే బతుకమ్మ చీరల అందజేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు అన్నారు .

అక్టోబర్ 5వ తేదీ నుంచి బతుకమ్మ పండగ ప్రారంభం కానున్న నేపథ్యంలో సిద్ధిపేట జిల్లాలో బతుకమ్మ , దసరా పండుగ ఏర్పాట్లు , బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమం పై శుక్రవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట్రామ రెడ్డి , జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ముజమిల్ ఖాన్ , mp, mlc ,mla లు , మున్సిపల్ చైర్మన్ లు, కౌన్సిలర్ లు , mpp,zptc, mptc , సర్పంచ్ లు, ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు ,మున్సిపల్ , పంచాయితీ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సిద్ధిపేట జిల్లా వ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండి తెల్ల రేషన్ కార్డులలో నమోదైన మహిళలు 3 లక్షల 80 వేల 127 మంది ఉన్నారని తెలిపారు. ఇప్పటి వరకూ జిల్లాకు 2 లక్షల 88 వేల చీరలు వచ్చాయని మంత్రి తెలిపారు. మహిళలు మెచ్చేలా 19 రంగులు, 17 డిజైన్లతో కలిపి మొత్తం 289 రంగులతో సరికొత్తగా బతుకమ్మ చీరలు చూడ చక్కగా ఉన్నాయన్నారు.

వీటిని జిల్లా స్టాక్ పాయింట్ నుంచి మండల స్టాక్ పాయింట్ కు అక్కడి నుండి గ్రామ పంపిణి పాయింట్ కు చేర్చడం జరగిందన్నారు . రెండు రోజుల్లో మిగతా చీరలు జిల్లాకు వస్తాయన్నారు.
రేపటి నుండి కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, గ్రామాలలో బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమం జరిగేలా చూడాలన్నారు . ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో పండుగావాతావరణంలో బతుకమ్మ చీరల పంపిణి జరగాలన్నారు. మూడు రోజుల్లో బతుకమ్మ చీరలు పంపిణి ప్రక్రియ పూర్తికావాలని అధికారులను ఆదేశించారు.
అధిక వర్షాలతో జలాశయాలు ,చెర్వులు నిండుకుండలను తలపిస్తున్న నేపథ్యంలో బతుకమ్మలను నిమజ్జనం చేసే జలశాయల వద్ద బారికేడింగ్ తో సహా తగిన రక్షణ జాగ్రత్తలు చేపట్టాలన్నారు . బతుకమ్మ ఆడే ప్రదేశాలలో పరిశుబ్రత కార్యక్రమాలను పండుగ ముగిసే వరకూ చేపట్టలన్నారు. సరిపడా విద్యుత్ లైట్ లను ఏర్పాటు చేయాలన్నారు. చెరువుల అలుగుల పై పేరుకుపోయిన పాకురు , నాచు తో ప్రజలు జారిపడే అవకాశం ఉన్న దృష్ట్యా పట్టణాలు ,గ్రామీణ ప్రాంతాలలో జలాశయాల అలుగుల లోని పాకురు , నాచు లను క్షేత్ర అధికారులు తొలగించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సద్దుల బతుకమ్మ , దసరా పర్వ దినాలు ఘనంగా జరిగేలా చూడాలన్నారు .
పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ చైర్మన్ , మున్సిపల్ కమి షనర్ లు , కౌన్సిలర్ లు , గ్రామీణ ప్రాంతాల్లో mptc , సర్పంచ్ , కార్యదర్శి లు వేడుకల నిర్వహణకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలన్నారు .
పోలీస్ లు సిసి కెమెరాల ను ఏర్పాటు చేసి వేడుకల్లో అవాంచనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు . కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ వేడుకలు జరిగేలా చూడాలన్నారు . మిషన్ మోడ్ లో అన్ని గ్రామాలు , పట్టణాల్లో రెండో డోస్ తో సహా కరోనా వాక్సినేషన్ వందశాతం పూర్తి చేసేలా చూడాలన్నారు . వాక్సినేషన్ వందశాతం పూర్తైన గ్రామాల్లో పూర్తయినట్లు తెలిపే బోర్డుల ఏర్పాటు చేయాలన్నారు. ఆ విషయాన్నీ బహిరంగంగా అందరికి తెలిసేలా ప్రకటించాలని అన్నారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు ను జిల్లా కలెక్టర్ , స్థానిక mla శ్రీ ఒడితెల సతీష్ కుమార్ తో కలిసి సందర్శించి పెండింగ్ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు . గౌరవెల్లి ప్రాజెక్ట్ ను కూడ సందర్శించి పెండింగ్ పనుల పూర్తి పై ఇంజనీరింగ్ అధికారులు , గుత్తేదార్ల తో చర్చించాలని జిల్లా కలెక్టర్ , స్థానిక mla మంత్రి సూచించారు.

జిల్లా కలెక్టర్ శ్రీ పి వెంకట్రామ రెడ్డి జిల్లాలో బతుకమ్మ , దసరా పండుగ ఏర్పాట్లు , బతుకమ్మ చీరల పంపిణి సజావుగా జరిగేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు . జిల్లా కేంద్రంలో జిల్లా యంత్రాగం మున్సిపల్ అధికారులను సమన్వయము చేసుకుంటూ పండుగ ఏర్పాట్లను పర్యవేక్షిస్తుందన్నారు . మండల కేంద్రాల లో మండల ప్రత్యేక అధికారులు , mpdo, తహసిల్దార్ లు , mpo లు , సబ్ ఇన్స్పెక్టర్ లు mpp, zptc ల ను సమన్వయము చేసుకుంటూ పండుగ ఏర్పాట్లు చేస్తారని జిల్లా కలెక్టర్ తెలిపారు .
పండుగ ఏర్పాట్లు , చీరల పంపిణి ఏర్పాట్ల పై శుక్రవారం సాయంత్రం మండల కేంద్రాల లో సమావేశం నిర్వహించుకుని ఆ దిశగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు మండల ప్రత్యేక అధికారులు , mpdo, తహసిల్దార్ లు , mpo లు , సబ్ ఇన్స్పెక్టర్ లు mpp, zptc లతో చూడాలని ఇప్పటికే సూచించామని కలెక్టర్ తెలిపారు .
అదే విధంగా గ్రామాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులను సమన్వయము చేసుకుంటూ ఏర్పాట్లు చేస్తారని తెలిపారు . వేడుకలకు వచ్చే పజలకు స్వాగత ఫ్లెక్సీ లు ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులకు సూచించామన్నారు . కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు పెద్ద ఎత్తున పండుగ వాతవరణంలో వేడుకలకు ఏర్పాట్లు చేయాలనీ క్షేత్ర అధికారులను ఆదేశించామని కలెక్టర్ మంత్రికి తెలిపారు .
టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి రోజా రాధా కృష్ణ శర్మ , mla లు శ్రీ వోడితెల సతీష్ కుమార్ , శ్రీ రసమయి బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు .

తీరొక్క రంగుల్లో బతుకమ్మ చీరలు
ఈ ఏడాది తెలంగాణ వ్యాప్తంగా ఆహార భద్రత కార్డు కింద నమోదైన మహిళలకు 1.08 కోట్ల చీరలు అవసరమవుతాయని నిర్ణయించిన అధికారులు ఆ మేరకు సిద్ధం చేయించారు. ఈ ఏడాది 17 సరికొత్త డిజైన్లను రూపొందించి వాటిని 20 విభిన్న రంగులతో అన్వయించి విస్తృత శ్రేణిలో మొత్తం 810 రకాల చీరలను అందుబాటులోకి తెచ్చారు. జరి అంచులతో 100 శాతం పాలిస్టర్‌ ఫిలిమెంట్‌,నూలుతో తయారుచేయడం విశేషం. 6.30 మీటర్ల పొడవుగల కోటి సాధారణ చీరలకు అదనంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వయోవృద్ధులు కట్టుకొనే 9 మీటర్లు పొడవు గల చీరలు 8 లక్షలు తయారుచేయించారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం మొత్తం రూ.333.14 కోట్లు కేటాయించింది.
నేటి నుండి ( అక్టోబర్ 2 ) పంపిణి షురూ…….

సిద్ధిపేట జిల్లా వ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండి తెల్ల రేషన్ కార్డులలో నమోదైన మహిళలు 3 లక్షల 80 వేల 127 మంది ఉండగా , ఇప్పటి వరకూ జిల్లాకు 2 లక్షల 88 వేల చీరలు వచ్చాయి . మిగతా చీరలు రెండు రోజుల్లో రానున్నాయి . ఇప్పటికే జిల్లాకు వచ్చిన చీరలను జిల్లా స్టాక్ పాయింట్ నుంచి మండల స్టాక్ పాయింట్ కు అక్కడి నుండి గ్రామ పంపిణి పాయింట్ కు చేర్చారు.
గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి లేదా సంబంధిత ప్రభుత్వ అధికారి, గ్రామ మహిళా సంఘం ప్రతినిధి, రేషన్‌ డీలర్‌ సభ్యులుగా ఉండే కమిటీ పర్యవేక్షణలో రేపటి నుండి చీరల పంపిణీ జరగనుంది. మున్సిపల్‌ వార్డు స్థాయిలో బిల్‌ కలెక్టర్, వార్డు మహిళా సంఘం ప్రతినిధి, రేషన్‌ డీలరు సభ్యులుగా ఉండే కమిటీ చీరలు పంపిణీ చేస్తుంది.

బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభించనున్న మంత్రి శ్రీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు

సిద్ధిపేట జిల్లా కేంద్రంలో బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమాన్ని శనివారం ( అక్టోబర్ 2) రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు లాoఛనంగా ప్రారంభించనున్నారు. జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాలలో స్థానిక శాసన సభ్యులు , మండల కేంద్రాలలో mpp, zptc లు , గ్రామాలలో స్థానిక ప్రజా ప్రతినిధులు బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మూడు రోజుల్లో పంపిణి ప్రక్రియను పూర్తి చేసేలా కార్యాచరణ ను అధికారులు సిద్ద్ధం చేసారు .

Share This Post