మహిళలను గౌరవించి వారి ఔన్నత్యాన్ని చాటి చెప్పే పండుగ బతుకమ్మ పండుగ – జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్

మహిళలను గౌరవించి వారి ఔన్నత్యాన్ని చాటి చెప్పే పండుగ బతుకమ్మ పండుగ అని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.

గురువారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో అదనపు కలెక్టర్ తిరుపతి రావు తో కలిసి అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొన్నారు.

వేడుకలను పూజలు చేసి ప్రారంభించి మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ పూలను పూజించే సంస్కృతి సంప్రదాయాలు ఒక్క తెలంగాణ రాష్ట్రం లోనే ఉన్నదని అన్నారు.

మహిళలంతా ఒక్క చోట చేరి సంతోషంగా జరుపుకునే పండుగని, ఈ బతుకమ్మ పండుగ మహిళలను గౌరవించి వారి ఔన్నత్యాన్ని చాటి చెప్పే పండుగని తెలిపారు.

ఈ వేడుకలలో అదనపు కలెక్టర్ తిరుపతి రావు, ట్రైనీ కలెక్టర్ కదిరవన్ ఫలనీ, డి ఆర్ ఓ హరిప్రియ, పిడి డి ఆర్ డి ఎ ప్రభాకర్, ఎఓ ప్రమీల, డి ఆర్ డి ఎ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

Share This Post