మహిళలు ఆనందంగా జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక – జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్

మహిళలు ఆనందంగా జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు

బుధవారం కలెక్టరేట్ లో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పూజలు నిర్వహించి వేడుకలను ప్రారంభించిన అనంతరం మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిందని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూలను పూజించే ఆచారం సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలోనే ఉందని ఈ పండుగను మహిళలు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటారని, మహిళలు సంతోషంగా పండుగ జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పుట్టింటి సారెగా బతుకమ్మ చీరలను అందిస్తున్నదని అన్నారు. బతుకమ్మ వేడుకలను ఏర్పాటు చేసిన తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్, రంగారెడ్డి జిల్లా వారికి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ప్రజలకు బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు కలెక్టర్ తెలిపారు.

ఈ వేడుకలలో అదనపు కలెక్టర్లు ప్రతీక్ జైన్, తిరుపతి రావు, డిఆర్ఓ హరిప్రియ, ఇబ్రహింపట్నం ఆర్ డి ఓ వెంకటాచారి,షాద్ నగర్ ఆర్ డి ఓ రాజేశ్వరి, చేవెళ్ల ఆర్ డి ఓ వేణుమాధవ్, రెవెన్యూ సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post