మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండగ మేడ్చల్​ – మల్కాజిగిరి కలెక్టరేట్​ ఆవరణలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండగ
మేడ్చల్​ – మల్కాజిగిరి కలెక్టరేట్​ ఆవరణలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి బతుకమ్మ పండగ ప్రతీక అని… ఆడబిడ్డల పండగను అంగరంగ వైభవంగా జరుపుకోవడం ఎంతో ఆనందకరమని మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్​ హరీశ్​ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్​ ఆవరణలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్​లోని మహిళా ఉద్యోగులు తదితరులు బతుకమ్మ పాటలు పాడుతూ పాటలకు లయబద్దంగా బతుకమ్మ ఆటలను ఆడారు. అదే ఉత్సాహంతో జిల్లా కలెక్టర్​ హరీశ్​ సైతం వారితో కలిసి కొద్దిసేపు బతుకమ్మ ఆటను ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా కలెక్టర్​ హరీశ్​ మాట్లాడుతూ… మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండగను తెలంగాణ రాష్ట్రం ఎంతో వైభవంగా నిర్వహిస్తోందని ఇది ఆడపడుచులకు ఇచ్చే గౌరవమని అన్నారు. మహిళలు ఎంతో భక్తితో ఆనందోత్సాహాల మధ్య ఈ పండగను జరుపుకొంటారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, , జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్​,కలెక్టరేట్ ఏఓ వెంకటేశ్వర్లు,ఆర్డీవోలు రవి, మల్లయ్య,ట్రేష రాష్ట్ర అధ్యక్షులు గౌతంకుమార్, తహసీల్దార్లు, ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post