మహిళల సంక్షేమానికి అనేక పథకాలు అమలు

మహిళల సంక్షేమానికి అనేక పథకాలు అమలు

తెలంగాణ ఆడబిడ్డలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు

ఇంటింటా జాతీయ పథకాల పంపిణీ

తెలంగాణ చౌక్ లో కి సీఎం కేసీఆర్ కటౌట్ కు రాఖీ కట్టిన మహిళా కార్పొరేటర్లు

రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

000000000

     ప్రపంచంలో, దేశంలో ఎక్కడలేని విధంగా మహిళల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు సీఎం కెసిఆర్ పాలనలో అమలు చేసి మహిళలను గౌరవిస్తున్నారని రాష్ట్ర బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

     శుక్రవారం తెలంగాణ చౌక్ లో మహిళా కార్పొరేటర్లు సీఎం కెసిఆర్ కటౌట్ కు రాఖీలు కట్టిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తెలంగాణ ఆడబిడ్డలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడుతారో అక్కడ దేవతలు నాట్యం చేస్తారని పురాణాలు చెబుతున్నాయని, సీఎం కెసిఆర్ పాలనలో
దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. మహిళల కోసం ఆసరా పింఛన్లు, వితంతు పెన్షన్లు, కెసిఆర్ కిట్, కల్యాణ లక్ష్మి అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అన్నారు. మహిళల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ఉపయోగపడుతున్న సీఎం తోబుట్టువుగా భావించి తెలంగాణ మహిళలు రాఖీలు కడుతున్నారు అన్నారు. ఈ సందర్భంగా అమ్మ మంత్రి గంగుల కమలాకర్ కు, నగర మేయర్ వాయిస్ సునీల్ రావు మహిళా కార్పొరేటర్లు, మహిళా సంఘాల సభ్యులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

     మంత్రి అంతకుముందు వజ్రోత్సవాల్లో భాగంగా కరీంనగర్ పట్టణంలోని శ్రీహరి నగర్ లో ఇంటింటికి జాతీయ పథకాలు పంపిణీ చేసి హరితహారం లో భాగంగా మొక్కలు నాటారు.

     ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరీష్ శంకర్, కార్పొరేటర్లు మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post