మహిళా ఉద్యోగినులు ఇబ్బందులు లేకుండా వారి విధులలో పాల్గొనేందుకు తగ్గింపు ధరతో స్కూటీలు ఇప్పించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ శృతి ఓజా అన్నారు.

పత్రికా ప్రకటన                                                                   తేది: 16-08-20 21

మహిళా ఉద్యోగినులు ఇబ్బందులు లేకుండా  వారి విధులలో పాల్గొనేందుకు తగ్గింపు ధరతో స్కూటీలు ఇప్పించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ శృతి ఓజా  అన్నారు.

సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో మహిళా ఉద్యోగినులకు  18 మందికి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా డిస్టినీ 125 మోడల్ 9   స్కూటీలు, ప్రేసర్ ప్లస్ మోడల్ 9 స్కూటిలు  మొత్తం 18 స్కూటీలను  పంపిణీ చేశారు. జిల్లా  అదనపు కలెక్టర్  శ్రీ హర్ష చొరవతో మహిళ పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ, సెర్ప్ లలో పనిచేసే మహిళా ఉద్యోగినులకు స్థానిక మేఘన షోరూం యాజమాన్యం గద్వాల్ వారితో తో మాట్లాడి 10,000 రూపాయల తగ్గింపు ధరలతో స్కూటీ లను ఇప్పించడం జరిగిందని తెలిపారు.   బ్యాంకర్లతో మాట్లాడి డౌన్ పేమెంట్ మరియు  నెలవారి కంతు కట్టడం లో కూడా వడ్డీ శాతం తగ్గింపు చేయించి స్కూటీ లను కొనుగోలు చేయడం జరిగిందని అదనపు కలెక్టర్ తెలిపారు. మహిళా ఉద్యోగినులకు స్కూటీలు ఇప్పించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.

కార్యక్రమం లో డి ఆర్ డి ఏ  ఉమాదేవి, డి పి ఓ శ్యాం సుందర్, మేఘన షో రూమ్ మేనేజింగ్ డైరెక్టర్ చైతన్య కృష్ణ, మధు ప్రియ, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ,  మహిళలు తదితరులు పాల్గొన్నారు.

——————————————————————

 జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల జారీ చేయడమైనది.

Share This Post