మహిళా విద్యకు ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.

పత్రికా ప్రకటన                                                              తేది:14.9.2021

        మహిళా విద్యకు ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.

మంగళవారం గద్వాల సమీపంలోని నది అగ్రహారం దగ్గర రూ. 10 కోట్లతో నిర్మించిన మహిళ పిజి హాస్టల్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు విద్యార్థినులు, అధ్యాపక సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళా విద్యకు పెద్దపీట వేసిందని ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత చదువులు చదివే అన్ని వసతులతో కూడిన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ రాథోడ్, స్థానిక నాయకులు అధికారులు పాల్గొన్నారు.

———————————————————————————-

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి ద్వారా జారీ చేయడమైనది.

Share This Post