మహిళా, శిశు, సంక్షేమ శాఖ డిస్ట్రిక్ట్ లెవల్ మేనేజ్ మెంట్ కమిటీ సమావేశము : జిల్లా కలెక్టర్ షేక్ యస్మిన్ బాష

పత్రిక ప్రకటన                                                                    తేది:7-10-2021
వనపర్తి

జిల్లాలో బాలకార్మిక, బాల్య వివాహాలను అరికట్టే విధంగా అధికారులు అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షేక్ యస్మిన్ బాష, సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం కల్లెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా , శిశు, సంక్షేమ శాఖ డిస్ట్రిక్ట్ లెవల్ మేనేజ్ మెంట్ కమిటీ  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మండల స్థాయి, గ్రామ స్థాయిలలో బాలల సంరక్షణ సొసైటీ వారు ఇచ్చిన ఎజెండాను సర్కులేట్ చేసుకొని, ఎక్కడ బాల్యవివాహాలు జరగకుండా చూసుకోవాలని ఆమె అన్నారు. బాల్య వివాహాలను ఆపడానికి పోలీస్, రెవిన్యూ శాఖల సహకారం తీసుకోవాలని ఆమె సూచించారు. అన్ని పోలీస్ స్టేషన్లలో గ్రామపంచాయతీ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, చైల్డ్ లైన్ , సఖి ఫోన్ నెంబర్లను డిస్ప్లే చేసి, బాలల హక్కులపై, చట్టాలపై అవగాహన కల్పించాలని ఆమె తెలిపారు. గుర్తింపు లేని చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ లను గుర్తించి వారిపై కేసు నమోదు చేయాలనీ ఆమె అన్నారు.
జిల్లా విద్యాశాఖ అధికారి సహకారంతో ప్రతి పాఠశాలకు షెడ్యూల్ ఇచ్చి బాలల ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలనీ ఆమె సూచించారు. అనాధ బాలలను గుర్తించి బాలికలను కస్తుర్బా పాఠశాలల్లో , బాలలను రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించుటకు చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. అన్ని పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని విద్యా శాఖ అధికారులకు ఆమె ఆదేశించారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ప్రతి 2 నెలలకు ఒకసారి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ లను విజిట్ చేసి, సానిటేషన్, హైజీన్ చెక్ చేసి, బాలల సంరక్షణ గురించి వివరాలను తెలుసుకోవాలని ఆమె వివరించారు. చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలనీ ఆమె అన్నారు.
ఆర్.బి.ఎస్.కె టీం ద్వారా షెడ్యూల్ తయారు చేసుకొని  స్కూల్స్ లో పిల్లల ఆరోగ్యాన్ని పరీక్షించాలని వైద్య అధికారులకు ఆమె ఆదేశించారు.  పిల్లలను దత్తత తీసుకునే వారికి ప్రభుత్వ నిబంధనలను చట్టాల పై అవగాహన కల్పించాలని, చట్ట విరుద్ధంగా పిల్లలను పెంచుకున్న, దత్తత తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆమె సూచించారు. అనాధ బాలలకు ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్ లను జారి చేయాలనీ రెవిన్యూ అధికారులకు ఆమె ఆదేశించారు. చైల్డ్ లైన్ , సఖి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ టోల్ ఫ్రీ నెంబర్ 181 లు 24 గంటలు అందుబాటులో ఉండాలని, సిబ్బంది ఫోన్ లకు వెంటనే స్పందించి సహాయ చర్యలు చేపట్టాలని ఆమె అన్నారు. పోక్సో కేసులు ఎన్ని ఉన్నాయని, తప్పి పోయిన పిల్లల్లో ఎంత మంది ట్రేస్ అవుట్ అయ్యారని, ఆమె అడిగి తెలుసుకున్నారు. ప్రజా ప్రతినిధులు ,  అధికారులు అందరు చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సమన్వయంతో సమస్యలను పరిష్కరించడానికి సహాయ సహకారాలు అందించాలని ఆమె కోరారు. జిల్లాలో 882 కేసులు నమోదు కాగా వాటిలో 669 పరిష్కరించరు తెలిపారు. సఖి కేంద్రానికి సహాయ సహకారాలు అందించినందుకు గాను జిల్లా పోలీసు శాఖ, డి డబ్ల్యూ ఓ, సఖి సెంటర్ మహిళలను జిల్లా కలెక్టర్ అభినందించారు.
ఈ   సమావేశములో ఏ ఎస్ పి షాకీర్ హుస్సేన్,డి డబ్ల్యు ఓ, కృష్ణా చైతన్య అధికారులూ డిఆర్డీవో నరసింహులు ,డి ఈ వో రవీందర్, డిపిఓ సురేష్, డాక్టర్ రవిశంకర్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఇంచార్జి తామస్, సఖి సిబ్బంది, సి.డి.పి.ఓ లు, సుపర్వైజర్లు , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
——————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి  ద్వారా జారి చేయబడినది.

Share This Post