మహిళా, శిశు సంక్షేమ శాఖ, షెడ్యూల్డ్ కులాలు, డి.ఆర్.డి.ఓ. శాఖల ఆధ్వర్యంలో రైతు సంబరాలలో భాగంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ముగ్గుల పోటీలు

పత్రికా ప్రకటన
10 .1 .2022 .వనపర్తి.

రైతు సంబరాల లో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో సోమవారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, డి ఆర్ డి ఓ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని 14 మండలాల నుండి మహిళా సంఘాల సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రంగవల్లులు తీర్చిదిద్దారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రైతుల పరిస్థితి, అంతకు ముందు రైతుల పరిస్థితుల గురించి మహిళలు ముగ్గుల రూపంలో అందంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష ఆదేశాలతో పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో రైతుబంధు పథకం ద్వారా రూ.50 వేల కోట్ల ఆర్థిక సహాయాన్ని రైతులకు అందించడంతో రైతులు సంబరాలు జరుపుకుంటున్నారని అన్నారు. ముగ్గుల పోటీలలో మొదటి రెండవ మూడవ బహుమతులు, అలాగే వ్యక్తిగతంగా 3 బహుమతులు ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. న్యాయనిర్ణేతలుగా పైన తెలిపిన మూడు శాఖల అధికారులు ఉంటారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డి. ఆర్. డి. వో.నర్సింలు, పుష్పాలత, నుషితా, మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి అందమైన ముగ్గులను తీర్చిదిద్దారు….. జిల్లా పౌరసంబంధాల అధికారి వనపర్తి చేజారి చేయబడినది.

Share This Post