మహిళా సంఘాలు సామాజిక వెలుగులు కావాలి – నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

మహిళా సంఘాలు సామాజిక వెలుగులు కావాలి – నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

 

మహిళా సంఘాలు సామాజిక వెలుగులు కావాలని, పదిమందికి ఉపాధి కల్పించే వ్యాపారవేత్తలుగా రాణించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ పిలుపునిచ్చారు.

బుధవారం నాగర్ కర్నూలు పట్టణంలోని  సుఖ జీవన్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో 75 వసంతాల ఆజాధికా అమృత్ మహోత్సవంలో భాగంగా 14 బ్యాంకులో ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యాంకులు ప్రజా చేరువ కార్యక్రమం ద్వారా చేపట్టిన మెగా రుణ మేళ ను జ్యోతి ప్రజ్వలనతో జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ ప్రారంభించారు

జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ…. వివిధ బ్యాంకుల్లో

స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు పొంది 99% రుణాల చెల్లింపులో చేసిన కారణంగా స్వయం సహాయక సంఘాలను జిల్లా కలెక్టర్ అభినందించారు. ఒక్కొక్కరుగా

చిన్న రుణాలనే తీసుకొని చెల్లించే పద్ధతి కాకుండా, సంఘాలు సంఘటితంగా ఏర్పడి పెద్ద వ్యాపారవేత్తలుగా రాణించాలని అన్నారు.

రుణాలు పొందేందుకు బ్యాంకుల నియమ నిబంధనలను అనుసరిస్తూ మహిళా సంఘాలు స్వయం ప్రాతిపధిక శక్తులుగా ఎదగాలని సమాజంలో ఒకబలీయమైన వ్యవస్థగా ఉండాలని ఉద్భోదించారు.

ఉదాహరణకు మన పక్క జిల్లా మహబూబ్ నగర్ కు చెందిన 55 ఏండ్ల జయమ్మ అనే మహిళ వ్యాపారాల్లో రాణిస్తూ పది మందికి ఉద్యోగాలు కల్పిస్తూ లక్షల రూపాయలను సంపాదిస్తున్నారని, వివరించారు.

వివిధ బ్యాంకుల ద్వారా

మహిళా సంఘాలు రుణాలు పొంది వ్యాపారవేత్తలుగా ఎదిగేలా చర్యలు చేపట్టాలని డి ఆర్ డి ఓ ను ఆదేశించారు.

అదేవిధంగా రుణాలు తీసుకునేందుకు బ్యాంకుల కావలసిన డాక్యుమెంట్స్ తదితర పత్రాల ఏర్పాటుకు సహాయ సహకారాలు అందించాలన్నారు.

మహిళలు వ్యాపారాల్లో ఆశయాలకు అనుగుణంగా రోజురోజుకూ బలోపేతం కావాలన్నారు. గ్రామస్థాయి నుండి ఒక మంచి వ్యాపారానికి రూపకల్పనలో సంఘాలు గణనీయమైన పాత్ర పోషించాలన్నారు.

బ్యాంక్ అధికారులు

రుణాల మంజూరీ సమయంలో శాఖల సమన్వయం చేసుకొని అర్హులకు సకాలంలో రుణాలు అందించి యూనిట్లను గ్రౌండింగ్‌ చేయాలన్నారు.

ఇందులో సూక్ష్మ, మధ్య రుణాలు, ఆత్మ నిర్భర్‌ కార్య క్రమం కింద రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.

ప్రజలకు బ్యాంకులు మరింత చెరువు కావాలన్నారు.

వివిధ విభాగాల్లో అత్యధిక రుణాలను అందించిన బ్యాంకు అధికారులను, 100% రుణాల చెల్లింపులు చేసిన మహిళా సంఘాలకు ఏం చేస్తున్నట్లు బహుమతులను అందజేశారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో ని 364 మహిళా స్వయం సహాయ సంఘాల బ్యాంకు లింకేజీ రుణాలకై 16 కోట్ల 18 లక్షల రూపాయల చెక్కును మహిళా సంఘాలకు అందజేశారు.

వివిధ బ్యాంకుల ద్వారా ఏర్పాటుచేసిన స్టాళ్లను పరిశీలించి, రుణ మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ కౌశిక్ కిషోర్ పాండే, డిఆర్డిఎ పిడి నర్సింగ్ రావు, ఎస్బిఐ చీఫ్ మేనేజర్ శ్రవణ్ కుమార్, ఏ బిజీ చీఫ్ మేనేజర్ గౌతమ్ కుమార్, ఎస్ బి ఐ మేనేజర్ రమేష్, మెప్మా కోఆర్డినేటర్ రాజేష్, డిఆర్డిఎ డిపియం పద్మ, వివిధ బ్యాంకుల మేనేజర్లు, వివిధ శాఖల అధికారులు మహిళా స్వయం సహాయక సంఘాలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post