మహిళా సంఘాల రుణ లక్ష్యం పై రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్


మహిళా సంఘాల రుణ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
నవంబర్ 15 వరకు 316 సంఘాల ఎంసిపి వివరాలను బ్యాంకులకు సబ్మిట్ చేయాలి
1441 సంఘాలకు నవంబర్ 25 వరకు ఎంసీపీ లను సిద్ధం చేయాలి
రుణాలు చెల్లించని వారి పై తగిన చర్యలు
రుణ ఎగవేతదారుల నివారణకు ప్రత్యేక రికవరీ క్యాంపులు నిర్వహణ
మైక్రో ఆహారశుద్ధి కేంద్రాల ఏర్పాటు లక్ష్యాలను పూర్తి చేయాలి
మహిళా సంఘాల
రుణాలు తదితర అంశాలపై ఏ పీ ఎం లతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి నవంబర్ 9
:- మహిళా సంఘాల అందించే రుణ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాల రుణ లక్ష్యాల అంశంపై కలెక్టర్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. 2021-22 సంవత్సరం నవంబర్ మాసం వరకు జిల్లాలో 6901 మహిళా సంఘాలకు 255 కోట్ల రుణాలు అందించడం లక్ష్యం కాగా , ఇప్పటి వరకు 4789 సంఘాలకు 233 కోట్ల రుణాలు అందించామని అధికారులు వివరించారు. అనంతరం కలెక్టర్ మండలాల వారీగా రూపొందించిన మైక్రో క్రెడిట్ ప్లాన్ వివరాలను, బ్యాంకర్లకు సమర్పించిన వివరాలను ఆరా తీశారు. నవంబర్ 15 వరకు 316 మహిళా సంఘాలకు రూపొందించిన మైక్రో క్రెడిట్ ప్లాన్ బ్యాంకర్లకు సమర్పించాలని, నవంబర్ 25 వరకు 1441 మహిళా సంఘాలకు మైక్రో క్రెడిట్ ప్లాన్ రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు జిల్లాలో రుణాలు తీసుకున్న మహిళా సంఘాల సభ్యులు వాటిని తిరిగి చెల్లించాలని, నాన్ పర్ఫామింగ్ అసెట్ గా మారకూడదని కలెక్టర్ తెలిపారు. మన జిల్లాలో 3.16% మహిళా సంఘాలు ఎన్.పి.ఎ అయ్యాయని, 573 మహిళా సంఘాలు రెండు కోట్ల 23 లక్షల రుణాలు చెల్లిస్తే ఎన్.పి.ఏ కాకుండా ఉంటుందని అధికారులు వివరించారు. రుణ ఎగవేతదారుల అధికంగా ఉన్న మండలాల పై శ్రద్ధ వహించి ప్రత్యేక రికవరీ క్యాంపులు నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు ఎలిగేడు మండలంలో 10.70%, మంథని మండలం లో 7.6%, జూలపల్లి మండలంలో 6.47% ఎన్.పి.ఏ ఉందని, బ్యాంకర్లతో సమన్వయం చేసుకుంటూ సదరు సంఘాలకు నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. మంథని మండలం లో చిరుధాన్యాల వినియోగిస్తూ పిండి బిస్కెట్లు తయారీ యూనిట్ ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. గత సంవత్సరం జిల్లాలో పీఎంఎఫ్ఎంఈ కింద 135 యూనిట్ గ్రౌండ్ చేశామని, ప్రస్తుత సంవత్సరం 201 యూనిట్లను గ్రౌండ్ చేయడానికి గుర్తించామని అధికారులు వివరించారు. జిల్లాలో రుణాల ద్వారా ఏర్పాటు చేసిన 2240 చిన్న చిన్న వ్యాపారుల వివరాల మండలాల వారీగా అందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఓదెల, ధర్మారం, కమాన్పూర్, రామగిరి మండలాల్లో రూరల్ మార్ట్ ఏర్పాటు, మహిళా సంఘాల డైరీల తో లింక్ అప్ చేసే అవకాశాలను పరిశీలించాలని కలెక్టర్ పేర్కొన్నారు జిల్లాలో నూతన ఆసరా పింఛన్ల కోసం 57 సంవత్సరాల అర్హతతో 22640 దరఖాస్తులు వచ్చాయని, మరో 7936 దరఖాస్తులను రాష్ట్ర స్థాయి పరిశీలన పంపామని అధికారులు వివరించారు. ప్రభుత్వం నుండి మార్గదర్శకాలు వచ్చిన తర్వాత నూతన పెన్షన్ దరఖాస్తులను పకడ్బందీగా డిస్ పోస్ చేయాలని కలెక్టర్ సూచించారు.

జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్, అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి సునీత, సంబంధిత అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు

Share This Post