మహిళా సాధికారత, మహిళల పై గృహ హింస, పని ప్రదేశంలో లైంగిక వేధింపులు, సైబర్ నేరాలకు పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకునే విధంగా మహిళ కమిషన్ అండగా నిలుస్తుందని మహిళలు ధైర్యంగా ముందుకు రావాలని మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మమారెడ్డి అన్నారు.

శుక్రవారం హైదరాబాద్ జిల్లా కలెక్టరేటులోని సమావేశ మందిరంలో జిల్లాలోని మహిళలకు సంబందించిన సంక్షేమ కార్యక్రమాలు, చట్టాలు, వాటి అమలు పై జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షలో సునీతా లక్సమారెడ్డి మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకొకసారి స్త్రీల సమస్యల పై మానిటరింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని ఆశ వర్కర్లు, ఏ ఎన్ ఎం లు అంగన్వాడీ కార్యకర్తలకు స్త్రీ ల సమస్యల పై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పోష్ చట్టం మీద స్త్రీలకు అవగాహనా కల్పించాలని ప్రతి హాస్టల్, స్కూల్స్, కాలేజీలలో 181 , 1089  సఖి సెంటర్ నంబర్ మరియు స్థానిక పోలీస్ స్టేషన్ ఫోన్ నంబర్లు ప్రదర్శించాలని అన్నారు. ప్రతి కార్యాలయంలో కమిటీ లేని చోట తక్షణమే కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. మహిళలు ధైర్యంగా ముందుకు రావాలని.. అలాంటి వారికి భద్రత కల్పిస్తుందని భరోసా ఇచ్చారు.మహిళల పై అనైతిక చర్యలకు పాల్పడిన వారిపై కటినమైన చర్యలు చేపడతామని మరియు అలాంటి మహిళలకు కమీషన్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.జిల్లా న్యాయ సేవదికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు అందిస్తామని, లింగ నిర్ధారణ చేసే క్లినిక్ లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 

           ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు శ్రీమతి షహీన్ అఫ్రోజ్, శ్రీమతి కుమ్ర ఈశ్వరి భాయ్, శ్రీమతి కొమ్ము ఉమాదేవి యాదవ్, శ్రీమతి గద్దల పద్మ, శ్రీమతి సుదాం లక్ష్మి, శ్రీమతి కటారి రేవతి రావు, మహిళా కమిషన్ సెక్రటరీ శ్రీమతి సునంద, జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, హైదరాబాద్ జిల్లా సంక్షేమ అధికారి అక్కేశ్వర్ రావు, మరియు ఇతర జిల్లా అధికారులు  పాల్గొన్నారు.

????????????????????????????????????

Share This Post