మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధ్వర్యంలో బాలల హక్కుల వారోత్సవాలు 2021 లో భాగంగా సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

పత్రిక ప్రకటన                                                         తేదీ 10-11-2021

మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధ్వర్యంలో బాలల హక్కుల వారోత్సవాలు 2021 లో భాగంగా సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

బుధవారం  కల్లెక్టరేట్ కార్యాలయం లో మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధ్వర్యంలో బాలల హక్కుల వారోత్సవాలు 2021 లో భాగంగా సంతకాల సేకరణ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఇందులో   భాగంగా SAY YES TO GIRL CHILD అనే నినాదంతో ఆడపిల్లలకు ప్రాముఖ్యత ఇవ్వాలని అన్నారు.  అదేవిధంగా బాల్య వివాహాలు, బాలలపై లైంగిక వేదింపులు, దాడులు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరి పైన ఉందన్నారు.

ఇట్టి కార్యక్రమం లో అదనపు కలెక్టర్ రఘురామ శర్మ మాట్లాడుతూ బాల కార్మికులు లేకుండా చూడాలని , హోటల్ , రెస్టారెంట్ లలో ఎక్కడైనా బాల కార్మికులు  పని చేస్తున్నట్లు అయితే వారి యొక్క యజమానులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

డిడబ్యుఓ ముసాయిదాబేగం మాట్లాడుతూ పిల్లల సంరక్షణలో ప్రతి ఒక్కరి బాధ్యత ఉంటుందని, “ఆడపిల్లలను పుట్టానిద్ధాం ఏదగనిద్ధాం” అని ఆడ, మగ సమానమేనని అన్నారు.

కార్యక్రమం లో ఆర్డిఒ రాములు , జిల్లా వైద్య అధికారి చందు నాయక్, డి పి ఆర్ ఓ చెన్నమ్మ  , యం ఆర్ ఓ లక్ష్మి , తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————-

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి చే  జారి చేయనైనది.

 

Share This Post